తెలంగాణ

‘ఎయిరిండియా ప్రైవేటీకరణపై ఉద్యమం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: ఎయిరిండియా ప్రైవేటీకరణపై దేశవ్యాప్త ఉద్యమానికి త్వరలో ముంబైలో సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్టు ఎయిరిండియా ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు సుధాకర్ తెలిపారు. ఎఐటీయూసీ నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఎఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు టీ నరసింహన్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆర్‌డీ చంద్రశేఖర్, సీసీజీఈడబ్ల్యు రాష్ట్ర అధ్యక్షుడు వీ నాగేశ్వరరావు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్రీనివాసరావు, టీఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి ఎంకే బోస్ తదితరులు పాల్గొన్నారు. ఎయిరిండియా పది రోజుల ఉద్యమ కార్యాచరణకు రౌండ్ టేబుల్ సమావేశం పూర్తి సంఘీభావాన్ని ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన మంత్రి, రాష్టప్రతిలకు నిరసన లేఖలను రాయాలని నిర్ణయించారు. సమావేశానికి ఎఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ బాల్‌రాజ్ అధ్యక్షత వహించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉపాధి అవకాశాలు, సామాజిక బాధ్యత, ఆదర్శవంతమైన మానవ సంబంధాలు ఉండేలా దిశను నిర్ణయించారని, అలాంటి మహత్తరమైన ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయడానికి ప్రైవేటీకరించడానికి విదేశీ పెట్టుబడిదారులకు అప్పజెప్పడానికి మోదీ ప్రభుత్వం తీవ్రంగా కుట్రలకు పాల్పడుతోందని ఎఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ అన్నారు. ఎంప్లాయిస్ యూనియన్ నేత సుధాకర్ మాట్లాడుతూ ఎయిరిండియాలో నష్టాలన్నీ ప్రభుత్వ కుట్రలో భాగమేనని, గతంలో కేంద్ర ప్రభుత్వం 8 ప్రైవేటు ఎయిర్‌వేస్‌ను జాతీయం చేసిందని, 1990 తర్వాత ఎయిరిండియాలో పర్మినెంట్ రిక్రూట్‌మెంట్ నిలిపివేశారని గుర్తుచేశారు.
*చిత్రం... ఎయిరిండియా ప్రైవేటీకరణపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశం