తెలంగాణ

పరిష్కారానికి నోచుకోని టీచర్ల సమస్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ను కోరారు. ఈ మేరకు సంఘాల ప్రతినిథులు ఆమెకు ఒక వినతి పత్రాన్ని అందజేశారు. గత ఐదేళ్లలో విద్యామంత్రులు మారిపోయారని, అధికారులు మారిపోతున్నారని టీచర్ల సమస్యలు మాత్రం మారడం లేదని వారు వాపోయారు. గత ఐదేళ్లుగా నిలిచిపోయిన ఉపాధ్యాయుల పదోన్నతలు, అంతర్ జిల్లా బదిలీలు తదితర సమస్యలపై దృష్టి సారించి సత్వరం వాటిని పరిష్కరించాలని అన్నారు. కొత్త జిల్లా కేంద్రాల్లో ఎస్సెస్సీ మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటు చేయాలని, కొత్త జిల్లాలకు రెగ్యులర్ డీఈఓ పోస్టులను మంజూరు చేసి నియమించాలని అదే విధంగా కొత్త మండలాలకు ఎంఈఓ పొస్టులను మంజూరు చేయాలని కోరారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కొంత మంది టీచర్లపై డీఈఓ చర్యలు తీసుకోవడం సరైంది కాదని, వాటిని ఉపసంహరించుకోవాలని నేతలు ప్రత్యేక ప్రధానకార్యదర్శిని కోరారు. ఉపాధ్యాయ సంఘాల నేతల సమస్యలను ఓపికగా విన్న చిత్రా రామచంద్రన్ కొంత సమయం అన్ని సమస్యలను అధ్యయనం చేసిన తర్వాత వాటి పరిష్కారానికి కృషి చేయగలనని హామీ ఇచ్చినట్టు నేతలు కే జంగయ్య, చావ రవి, జీ సదానందం గౌడ్, పర్వతరెడ్డి, కే రమణ, మైస శ్రీనివాసులు, ఎం రఘుశంకర్ రెడ్డి, చంద్రశేఖర్, కృష్ణుడు తదితరులు పేర్కొన్నారు.
సీఏలో సిద్ధార్ధ జైన్ ప్రతిభ
దేశవ్యాప్తంగా ఇటీవల ప్రకటించిన సీఏ ఫలితాల్లో ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ ఫైనాన్షియల్ స్టడీస్ విద్యార్థి సిద్ధార్ధ జైన్ జాతీయ స్థాయిలో 30 ర్యాంకు సాధించినట్టు ఆ సంస్థ చైర్మన్ , కామర్స్ గురు అవినాష్ బ్రహ్మదేవర తెలిపారు. ఎల్‌బీ నగర్, కూకట్‌పల్లి, హిమాయత్ నగర్‌లలో తమ సంస్థ కార్యకలాపాలను నిర్వహిస్తోందని, 173 మంది సీఎ ఫౌండేషన్, సీఏ ఇంటర్ పరీక్షలను ఉత్తీర్ణులైనట్టు చెప్పారు. జాతీయ స్థాయిలో సగటున 23 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, తమ సంస్థ నుండి 60 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ తమ సంస్థ విజయాలను వివరించారు.
ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
*చిత్రం..చిత్రా రామచంద్రన్‌ను కలిసిన ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ప్రతినిధులు