తెలంగాణ

మున్సిపల్ కార్పొరేషన్లకు నిధులు ఇప్పిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు అవసరమైన మేరకు నిధులు ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని రాష్ట్ర ఆర్థిక కమిషన్ చైర్మన్ జి. రాజేశంగౌడ్ తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లతో బుధవారం ఆయన బేగంపేటలోని హోటల్ ప్లాజాలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొత్త మేయర్ల సలహాలను దృష్టిలో ఉంచుకుని, మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రజలకు వౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులు అవసరమన్నారు. పన్నులు తదితర మార్గాల ద్వారా వసూలు చేసే నిధులకు తోడుగా ప్రభుత్వం నుండి కూడా ఆర్థిక సాయం అందించేందుకు కృషి చేస్తానని రాజేశంగౌడ్ హామీ ఇచ్చారు. పరిపాలనా సౌలభ్యం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేశారన్నారు. కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా కొత్తమేయర్లు పనిచేయాలని సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను మరింత పటిష్టం చేసేందుకే కొత్త పురపాలక చట్టాన్ని తీసుకువచ్చారని రాజేశంగౌడ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక కమిషన్ సభ్యులు ఎం. చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు పాల్గొన్నారు.

*చిత్రం..మేయర్ల సమావేశంలో పాల్గొన్న రాజేశంగౌడ్, చెన్నయ్య తదితరులు