తెలంగాణ

తెలంగాణకు భూగర్భ జల సిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో భూగర్భ జలాలు గతంతో పోలిస్తే ఈసారి మెరుగ్గా కనిపిస్తున్నాయ. ఈ ఏడాది జనవరి వరకు నమోదైన వివరాలను విశే్లషిస్తే 852 మి.మీ సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా 14 శాతం అదనంగా వర్షపాతం నమోదైంది. దాదాపు 971 మి.మీ వర్షపాతం జనవరి నెల వరకు నమోదైంది. రాష్ట్రంలోని కామారెడ్డి, వనపర్తి, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, ములుగు, జయశంకర్, నిజామాబాద్, నారాయణపేట, సిద్ధిపేట, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది జనవరిలో సరాసరి నీటి మట్టం 8.8 మీటర్లు నమోదైంది. గత సంవత్సరం 2019లో ఇదే నెలలో 11.88 మీటర్లు నమోదైంది. అంటే మూడు మీటర్ల ఎత్తుకు పైపైకి భూగర్భ జలాలు వచ్చాయి. ఈ వివరాలను రాష్ట్ర భూగర్భ జల శాఖ విడుదల చేసింది. వనపర్తి జిల్లాలో కనిష్ట నీటి మట్టం 4.39 మీటర్లు, సంగారెడ్డి జిల్లాలో 18.77 మీటర్లు నమోదైంది.
ఆదిలాబాద్ జిల్లాలో 6.93 మీటర్లు, భద్రాద్రి కొత్తగూడెంలో 8.17 మీటర్లు, భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో 10.67 మీటర్లు, హైదరాబాద్‌లో 7.68 మీటర్లు, జగిత్యాలలో 4.96 మీటర్లు, జనగాంలో 8.15 మీటర్లు, జోగుళాంబ గద్వాల్‌లో 8.16 మీటర్లు, కామారెడ్డిలో 10.69 మీటర్లు, కరీంనగర్‌లో 6.24 మీటర్లు, ఖమ్మంలో 4.93 మీటర్లు, కొమురంభీం జిల్లాలో 6.94 మీటర్లు, మహబూబాబాద్‌లో 6.24 మీటర్లు, మహబూబ్‌నగర్‌లో 6.24 మీటర్లు, మంచిర్యాలలో 4.85 మీటర్లు, మెదక్‌లో 18.34 మీటర్లు, మేడ్చెల్‌లో 10.48 మీటర్లు, ములుగులో 6.81 మీటర్లు, నాగర్‌కర్నూల్‌లో 9.55 మీటర్లు, నల్లగొండలో 9.77 మీటర్లు, నారాయణపేటలో 9.87 మీటర్లు, నిర్మల్‌లో 7.55 మీటర్లు, నిజామాబాద్‌లో 8.91 మీటర్లు, పెద్దపల్లిలో 6.99 మీటర్లు, రంగారెడ్డిలో 14.67 మీటర్లు, సంగారెడ్డిలో 14.87 మీటర్లు, సిద్ధిపేటలో 12.24 మీటర్లు, రాజన్నసిరిసిల్లలో 8.18 మీటర్లు, సూర్యాపేటలో5.99 మీటర్లు, వికారాబాద్‌లో 14.10 మీటర్లు, వనపర్తిలో 4.39 మీటర్లు, వరంగల్ గ్రామీణ జిల్లాలో 5.05 మీటర్లు, వరంగల్ పట్టణ జిల్లాలో 5.05 మీటర్లు, యాదాద్రి జిల్లాలో 9.80 మీటర్ల లోతులో భూగర్భ జలాలు లభ్యమవుతున్నాయి. మొత్తం 33 జిల్లాలో 2019 జనవరితో పోల్చితే నీటి మట్టాలు పైకి వచ్చాయి. దీని వల్ల రానున్న వేసవిలో నీటి ఎద్దడి ప్రభావం గత ఏడాదితో పోల్చితే తగ్గుతుందని అధికారులంటున్నారు. ఈ నెలాఖరు నుంచి ఎండ తీవ్రత పెరుగుతుంది. గత ఏడాది విస్తారంగా వర్షాలు కురిసినందున నీటి ఎద్దడి నుంచి రాష్ట్రం సురక్షితంగా బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి.