తెలంగాణ

రెవెన్యూ చట్టాలపై అఖిలపక్ష సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: కొత్త రెవెన్యూ చట్టాల అమలుపై అఖిల పక్ష పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత సమర సింహారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ రెడ్డి రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఇక్కడ వారు గాంధీభవన్‌లో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, రెవెన్యూ చట్టాలు మారిస్తే అవి ప్రజలకు మరింత మేలు చేయాలన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ చట్టాలు చాలా బాగున్నాయన్నారు. ఇప్పటికే ఉన్న చట్టాలనలు పరిగణనలోకి తీసుకుని కొత్త చట్టాలను పరిశీలించాలన్నారు. గతంలో పంచాయతీ చట్టం తెచ్చినప్పుడు తాను చైర్మన్‌గా ఉన్నానని చెప్పారు. ప్రజల వద్దకు వెళ్లి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకుని చట్టాలను రూపొందించామన్నారు. తనకు అన్నీ తెలుసు అనే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించరాదన్నారు. ప్రజలకు మేలు చేయడం కోసం ఎన్నుకున్న అధికార పార్టీ సభ్యులు నమ్మకాన్ని వమ్ము చేయరాదన్నారు. ఒక చట్టం చేయాలంటే ప్రజలకు అనుకూలంగా ఉండాలన్నారు. మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ప్రతిపాదనలు తీసుకోవాలన్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి జీ నిరంజన్ మాట్లాడడుతూ టీఆర్‌ఎస్ ఎంపీ కే కేశవరావు ఏపీ రాజ్యసభ సభ్యుడని రాజ్యసభ చైర్మన్ ప్రకటించారన్నారు. కాని కేశవరావు మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణలో తక్కుగూడలో ఓటు వేశారన్నారు. కేవీపీ తెలంగాణకు చెందిన ఎంపీగా ఎన్నికల కమిషన్ ఒప్పుకుని ఓటుకు అనుమతి ఇచ్చారన్నారు. కేకేకు ఎలా అనుమతి ఇచ్చారన్నారు. నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎన్నికలసంఘం ముందు ప్రకటించిన ఎక్స్ అఫిషియో లిస్టులో ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి పేరు లేదన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యాక ఎన్నికల సంఘం అక్రమంగా సుభాష్ రెడ్డి పేరును ఎక్స్ అఫిషియో సభ్యుడిగా చేర్చిందన్నారు. ఎన్నికల కమిషన్ నాగిరెడ్డి ఈ అక్రమాలకు బాధ్యత వహించాలన్నారు. సహకార ఎన్నకల కమిషన్ ఇంతవరకు 20 లక్షల మంది ఓటు హక్కును తొలగించారన్నారు. రూ.1లక్ష రుణమాఫీని ప్రభుత్వం ఇంతవరకు చెల్లించలేదన్నారు.