తెలంగాణ

సైకో కిల్లర్‌కు సరైన శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 6: అభం శుభం తెలియని ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి హతమార్చిన కిరాతక సైకో కిల్లర్ మర్రి శ్రీనివాస్‌రెడ్డికి సరైన శిక్ష పడిందన్న భావన ప్రజలు, బాధిత కుటుంబాలు, మహిళ, ప్రజా సంఘాల నుండి వ్యక్తమైంది. బస్సు సౌకర్యం లేని హాజీపూర్ గ్రామానికి చెందిన విద్యార్థినులు శ్రావణి, మనీషా, కల్పనలను మండల కేంద్రం బొమ్మలరామారం నుండి తమ గ్రామానికి మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సివుంది. ఆటోల కోసం వేచివుండే బాలికలను లక్ష్యంగా చేసుకుని నిందితుడు వారితో పరిచయం పెంచుకుని తన బైక్‌పై లిఫ్ట్ ఇస్తానంటూ మాయమాటలు చెప్పి వారిని తన వ్యవసాయ క్షేత్రం వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసి అక్కడే పాడుబడిన రెండు బావుల్లో పూడ్చివేశాడు. నిందితుడు చేతిలో బలైన తొమ్మిదవ తరగతి విద్యార్థిని పాముల శ్రావణి(14) 2019 ఏప్రిల్ 24న పదవ తరగతి ముందస్తు తరగతులకు వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. శ్రావణి అదృశ్యంపై బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు గ్రామస్తులు ఆమె కోసం వెతుకుతుండగా నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలోని ఒక పాతబావిలో శ్రావణి బ్యాగ్ కనిపించింది. పక్కనే ఉన్న మరో పాతబావిలో దుర్వాసన రావడం గమనించడంతో శ్రావణి మృతదేహం వెలుగుచూసింది. ఏప్రిల్ 26న శ్రావణి మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు ఇదే గ్రామానికి చెందిన తిప్పరబోయిన మనిషా (17)ను కూడా హత్యాచారం చేసి అదే బావిలో పూడ్చాడని, అంతకుముందు నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన తుంగని కల్పన (11)పై కూడా హత్యాచారం చేసి పక్కనే ఉన్న మరో పాతబావిలో పూడ్చినట్టుగా తేలింది. మనీషా, కల్పన మృతదేహాలను గత ఏడాది ఏప్రిల్ 27న పోలీసులు వెలికి తీశారు. 2019 మార్చి 15న కళాశాలకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న మనీషాకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి తన బైక్‌పై తీసుకెళ్లిన శ్రీనివాస్‌రెడ్డి ఆమెపై హత్యాచారానికి పాల్పడి పాడుబడిన బావిలో పూడ్చాడు. ఇక బొమ్మలరామారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న మైసిరెడ్డిపల్లికి చెందిన తుంగని కల్పన 2015 ఏప్రిల్ 22న హాజీపూర్‌లోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో అదృశ్యమైంది. ఆమెను నిందితుడు బైక్‌పై లిఫ్ట్ ఇస్తానంటూ మభ్యపెట్టి హత్యాచారం చేసి తన వ్యవసాయ బావిలో పూడ్చివేయగా నాలుగేళ్ల పిదప శ్రావణి, మనీషాల అదృశ్యం కేసుల విచారణ సందర్భంగా ఆమె హత్యాచారానికి గురైన ఘటన వెలుగు చూసింది. ముగ్గురు బాలికలను కిరాతకంగా హతమార్చిన నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి కర్నూల్‌కు చెందిన మరో మహిళ హత్య కేసులో కూడా నిందితుడుగా ఉన్నాడు. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్ష పడేలా చేయడంలో తగిన వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను సీపీ మహేష్‌భగవత్ అభినందించారు.