తెలంగాణ

నేడు మేడారానికి సీఎం కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడారం ఆంధభూమి బృందం, ఫిబ్రవరి 6: మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రానుండడంతో మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, ఈటల రాజేందర్, ఎంపీ మాలోతు కవిత, ములుగు జడ్పీ చైర్‌పర్సర్మన్ కుసుమ జగదీశ్ అధికారులతో సమాలోచనలు జరిపారు. ముందుగా మంత్రులు అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆలయానికి చేరుకోగా పూజారులు స్వాగతం పలికారు. అమ్మవార్లకు ఎత్తుబంగారం (బెల్లం), పసుపు, కుంకుమ, చీరెసారెలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీని పరిశీలించి తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం ముఖ్యమంత్రితో పాటు గవర్నర్ కూడా వస్తుండటంతో నేరుగా మంత్రులే రంగంలోకి దిగి ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు ముఖ్యమంత్రి, గవర్నర్ రాక సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం రోగులకు జాతరలో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా పాయింట్‌ను పరిశీలించారు. మేడారం ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి మగ ఇడ్డకు ఓ భక్తురాలు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే మహారాష్టల్రోని పూణె శనినగర్ గ్రామానికి చెందిన చవాన్ శివాని నిండు గర్భవతి. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకోవాలనే తపనతో ప్రసవం తారీఖు దగ్గరపడ్డా లెక్కచేయకుండా కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం మేడారం చేరుకున్నారు గురువారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో మేడారం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ఉదయం 11-38 గంటలకు సాధారణ ప్రసవం జరిగింది. కాగా, ఆమెను మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించి కేసీఆర్ కిట్‌ను అందజేశారు. పుట్టిన బిడ్డకు జంపన్నగా నామకరణం చేశారు. మొదటి సంతానంగా ఆడబిడ్డ ఉందని ఇప్పుడు తల్లి సన్నిధిలో మగబిడ్డ పుట్టడం చాలా ఆనందంగా ఉందని, ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది మంచి సేవలు అందించారని, ఇటువంటి అటవీ ప్రాంతంలో ఆసుపత్రి ఏర్పాటు చేసి తన లాంటి భక్తులకు సరైన సమయంలో వైద్య సేవలు అందించడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేసింది.
గుండెపోటుతో ఒకరు మృతి
మేడారం సారలమ్మ మహాజాతరలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి గురువారం గుండెపోటుతో మృతి చెందారు. జిల్లాలోని కమ్మలపెల్లికి చెందిన నర్సయ్య (50) కుటుంబ సమేతంగా సమ్మక్క-సారలమ్మను దర్శించుకోవడానికి వచ్చారు. కాగా గురువారం రెడ్డిగూడెంలో ఒక్కసారిగా కిందపడిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు 108 ద్వారా ములుగుకు తరలిస్తుండగా మార్గమధ్యాన మృతి చెందాడు.
*చిత్రం...అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తున్న మంత్రులు