తెలంగాణ

ప్రజలే కేంద్రంగా పురపాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 6: ప్రజలే కేంద్రంగా పురపాలన జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. పట్టణ ప్రజలతో పురపాలక శాఖాధికారులు మమేకం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అందాల్సిన పౌర సేవలు అత్యంత పారదర్శకంగా, అవినీతిరహితంగా వేగవంతంగా అందించాలనే లక్ష్యంతోనే కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకవచ్చామని అన్నారు. ప్రజాస్వామ్యంలో పాలకులకు అంతిమంగా ప్రజలే బాసులని గుర్తు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కమిషనర్లకు మున్సిపల్ కొత్తచట్టంపై డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. అవినీతికి ఆస్కారం లేకుండా నిర్దిష్ట వ్యవధిలో భవన నిర్మాణాలకు అనుమతులు జారీ చేయాలని ఆదేశించారు. అనుమతుల విషయంలో ఎలాంటి అవినీతికి పాల్పడిన కఠిన చర్యలు తప్పవని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. నామమాత్రంగా చర్యలు కాకుండా ఏకంగా ఉద్యోగం నుంచే పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేశారు. భవన నిర్మాణ అనుమతుల అంశాన్ని హైదరాబాద్ నుంచే నేరుగా పర్యవేక్షిస్తామన్నారు. కొత్త మున్సిపల్ చట్టంలోని విధులనే మున్సిపల్ కమిషనర్లు జాబ్ చార్ట్‌గా భావించాలన్నారు. ప్రజలతో మమేకం కావడానికి సోషల్ మీడియా వంటి వినూత్న వేదికలను విరివిగా ఉపయోగించుకోవాలని సూచించారు. పురపాలన పూర్తిగా పౌరులనే కేంద్రంగా చేసుకొని జరగాలని అన్నారు. ప్రజలకు పురపాలన మరింత చేరువ కావాలన్నారు. పట్టణ ప్రజలు అధికారుల నుంచి అద్భుతాలేమి ఆశించడం లేదని, కేవలం వారి ప్రాథమిక అవసరాలు, పౌర సేవలు అందిస్తే సరిపోతుందన్న అభిప్రాయంతో ఉంటారన్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని పిలుపునిచ్చారు. అధికార వికేంద్రీకరణే స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అదే స్ఫూర్తితో ప్రజలకు పరిపాలన ఫలాలు అందాలన్నారు. ఇదే లక్ష్యంతో మరిన్ని కొత్త గ్రామ పంచాయతీలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం ఆశించిన ఫలాలు, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కమిషనర్లతో పాటు సిబ్బంది ప్రజలతో మమేకమై పని చేయాలని అన్నారు. మున్సిపల్ కొత్త చట్టంలోని పారిశుద్ధ్యం, పచ్చదనం, పౌర సేవలు, భవన నిర్మాణ అనుమతులు వంటి అంశాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. భవన నిర్మాణ అనుమతుల కోసం టీఎస్-బిపాస్ విధానాన్ని తీసుకవస్తున్నామన్నారు. దీని ప్రకారం 21 రోజుల్లో భవన నిర్మాణాలకు అనుమతి జారీ చేయాలన్నారు. ప్రతి పట్టణంలో పారిశుద్ధ్యం కమిషనర్ల ప్రాథమిక విధి అన్నారు. ఉదయం 4.30 గంటలకే పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలని సూచించారు. పట్టణాలు, నగరాలలో సాధ్యమైనంత మేరకు ఎక్కువ పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలన్నారు. మహిళలకు ప్రత్యేకంగా షీ టాయిలెట్స్ నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. మున్సిపల్ కొత్త చట్టం ప్రకారం బడ్జెట్‌లో 10 శాతం నిధులను పచ్చదనం కోసం ఖర్చు చేయాలన్నారు. ప్రతి పట్టణానికి పారిశుద్ధ్య ప్రణాళికతో పాటు పచ్చదనం ప్రణాళిక ఉండాలన్నారు. దీంతో పాటు సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు అవసరమైన హెల్త్ ప్లాన్‌ను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అవసరమైతే వెటర్నరీ డాక్టర్లు, ఎంటమాలజిస్ట్‌లు ఇతర సిబ్బంది సహకారం తీసుకోవాలని సూచించారు. జాతీయ స్థాయిలో వినూత్న విధానాలతో పలు నగరాలు ముందుకు పోతున్నాయని అలాంటి వాటిని అధ్యయనం చేసి స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్లతో పాటు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్‌ఎండిఏ, జిహెచ్‌ఎంసి, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. .
*చిత్రం...ఎంసీహెచ్‌ఆర్‌డీలో గురువారం మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లకు
దిశా నిర్దేశం చేస్తున్న మున్సిపల్ మంత్రి కేటీఆర్