తెలంగాణ

కరోనా లక్షణాలున్న 11 మందికి పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, ఫిబ్రవరి 6: గాంధీ అసుపత్రిలో కరోనా ఆనుమాణిత లక్షణాలతో 11మందికి వ్యాధి నిర్దారణ నిమిత్తం వైద్య పరీక్షలు చేయటంతో పాటు, అవరమైన చికిత్సను అందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రావణ్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు గాంధీ ఆసుపత్రిలో చేసిన పరీక్షలలో అన్ని కూడా పీవర్ ఆసుపత్రి నుంచి వచ్చిన కేసులతో పాటు గాంధీలో చేరిన వారికి నిర్వహించిన పరీక్షలన్ని కరోనా వైరస్‌కు నెగిటివ్ రిజల్ట్స్ వచ్చాయని తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరు చైనా దేశస్తులున్నట్లు ఆయన తెలిపారు.
వీరిద్దరు కూడా ఇదివరకే ఫీవర్ ఆసుపత్రిలో చేరి, పరీక్షలు చేయించుకున్నారని, రిపోర్టులు వచ్చే లోపే వారు తిరిగి వెళ్లిపోయినట్లు అధికారులు గుర్తించి, వారున్న ప్రాంతానికి వెళ్లి వారిని తీసుకువచ్చి, మళ్లీ గాంధీలో చేర్చించి చికిత్స అందజేస్తున్నట్లు సమాచారం. మరోసారి వీరి శ్యాంపిల్స్ సేకరించి, మరోసారి పరీక్షలు చేస్తామని, శుక్రవారం రిపోర్టులు రానున్నట్లు, వాటిని పూణేకు పంపనున్నట్లు డా.శ్రావణ్‌కుమార్ తెలిపారు.
ఒక వేళ రిపోర్టులు పాజిటీవ్‌గా వచ్చినా, కేసులను అధికారింగా తాము ప్రకటించలేమని, ఆ ప్రకటన పూణే నుంచే వస్తుందని వివరించారు. సాధారణ అనారోగ్యంతో వచ్చే రోగులకు, కరోనా అనుమానిత లక్షణాలతో వచ్చే రోగులకు అవగాహన కల్పించేందుకు ఆసుపత్రి ఎంట్రెన్స్‌లో కరోనా ఐసోలేటెడ్ వార్డు బోర్డులను ఏర్పాటు చేశామని, ప్రత్యేక హెల్ప్ డెస్క్‌తో పాటు కరోనా అనుమానిత లక్షణాలతో వచ్చే వారి కోసం ప్రత్యేకంగా లిఫ్టును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
*చిత్రం...గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కరోనా హెల్ప్ డెస్క్