తెలంగాణ

సంక్షేమం, వ్యవసాయం అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 6: వచ్చే పక్షం రోజుల్లో రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలోప్రవేశపెట్టేందుకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో నిధుల సమీకరణపై దృష్టిని సారించింది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధిరేటు 21 శాతం నుంచి తగ్గుమముఖం పట్టనుండడంతో, ఆ మేరకు నిధుల లోటును భర్తీ చేసే విషయమై ప్రభుత్వం అనేక మార్గాలను ఆనే్వషిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పగ్గాలు చేపట్టిన తర్వాత గత ఆరేళ్లలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. దీనికి తోడు పరిశ్రమలు, ఐటీ రంగంలో పెట్టుబడులు వరదలా వచ్చాయి. కాని ఏడాది నుంచి ఆర్థిక మాంద్యం ప్రభావం వల్ల ఆశించిన విధంగా రాష్ట్ర ఖజానాకు ఆదాయం తగ్గినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీనికి తోడు కేంద్రం నుంచి నిధుల కోసం ఆశించి భంగపడడం కంటే సొంత వనరుల సమీకరణపై శ్రద్ధ పెట్టడం మంచిదనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల మాదిరిగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిరేటు మైనస్‌కు దిగజారకపోవడం రాష్ట్ర ఆర్థిక బలానికి చిహ్నమని అధికారులంటున్నారు. తెలంగాణకు కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో జీఎస్‌టీ ఆదాయం రావడం లేదు. కేంద్ర పన్నుల్లో రావాల్సిన వాటా నిష్పత్తిని కూడా తగ్గింది. తెలంగాణ రాష్ట్రానికి 2019-20లో రూ.19,178 కోట్ల మేరకు నిధులు కేంద్రం నుంచి రావాల్సి ఉండగా, సవరించిన అంచనాల్లో ఈ మొత్తాన్ని రూ.15,987 కోట్లకు తగ్గించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.3731 కోట్లు తగ్గాయి. కేంద్రం నుంచి ఆశించిన నిధులు వస్తాయని భావించి రూపొందించుకున్న ఆర్థిక ప్రణాళికలపై ప్రతికూల ప్రభావం పడింది.