తెలంగాణ

జన‘మేడారం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీకారణ్యం కాస్తా జనారణ్యంగా మారిపోయంది. మహాజాతరలో మరో ఘట్టం ఆవిష్కృతమైంది.. తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతికెక్కిన మేడారం జాతరలో భాగంగా బుధవారం సారలమ్మ గద్దెపైకి రాగా.. గురువారం రాత్రి 9:10 గంటలకు సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకొంది. సమ్మక్క వేదికపైకి చేరుకొనే వేళ.. ఇసుకేస్తే రాలనంతగా ఉన్న భక్తుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయ. చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని గద్దెపైకి పూజారులు అశేష జనసందోహం మధ్య చేర్చారు. ఈ సందర్భంగా పోలీస్ బాస్ ఎస్పీ సంగ్రాంసింగ్‌జీ పాటిల్ అధికార లాంఛనాల్లో భాగంగా గాల్లోకి తుపాకీని పేల్చారు. కాగా, శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తల్లుల దర్శనానికి చేరుకొని మొక్కులు సమర్పించుకోనున్నారు.
*చిత్రం...మేడారం జాతర రెండో రోజు గురువారం సమ్మక్క - సారలమ్మ దర్శనానికి ముందు జంపన్న వాగులో పుణ్యస్నానాలచరిస్తున్న భక్తజన సందోహం
* (ఇన్‌సెట్‌లో) సమ్మక్కతల్లి ఆగమనం సందర్భంగా గాల్లోకి తుపాకీ పేలుస్తున్న ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ.పాటిల్