తెలంగాణ

పరిపాలనలో కొత్త పుంతలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు రాష్ట్ర పరిపాలనను కొంతపుంతలు తొక్కించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 11న జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతిభవన్‌లో ఆరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశం సాయంత్రం వరకు కొనసాగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. జిల్లా కలెక్టర సమావేశంలో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కూడా పాల్గొంటారు. రాష్ట్ర పరిపాలనపై సమగ్రమైన చర్చ జరుగుతుందని తెలుస్తోది. ఈ నెల 15న ప్రాథమిక సహకార సంఘాలకు (ప్యాక్స్) ఎన్నికలు జరిగిన తర్వాత పాలకమండళ్లు ఏర్పాటవుతాయి. ఆ వెంటనే జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ) పాలకవర్గాల ఎన్నికలు, రాష్ట్ర బ్యాంక్ ఎన్నికలు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్), మార్క్‌ఫెడ్ పాలకవర్గాలకు ఎన్నిలకు జరుగుతాయి. ఈ నెల చివరివరకు ఈ ఎన్నికల కార్యక్రమం పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మరో నాలుగేళ్లపాటు ఎలాంటి ఎన్నికలు లేకపోవడం వల్ల ఇప్పటినుండి సమర్థవంతమైన పాలనను ప్రజలకు అందించాలని భావిస్తున్నారు. అవసరమైతే కఠినమైన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడకూడదని భావిస్తున్నారు.
ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు ప్రజల నుండి మంచి స్పందన లభించింది. అదే స్ఫూర్తితో మరో నాలుగేళ్లపాటు ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే పంచాయతీరాజ్, మున్సిపాలిటీలకు కొత్త చట్టాలను రూపొందించిన కేసీఆర్ ఇక రెవెన్యూ చట్టాన్ని కూడా తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. రెవెన్యూ శాఖలో జిల్లా కలెక్టర్లు కీలకభూమిక పోషిష్తారు. 33 జిల్లాలకు గాను ఇటీవలే 21 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేసేందుకు కలెక్టర్ల సదస్సును కేసీఆర్ ఉపయోగించుకుంటారని తెలుస్తోంది. రెవెన్యూ చట్టంపై సమావేశంలో వివరించి, అందరి అభిప్రాయాలను కూడా తెలుసుకుంటారని తెలుస్తోంది. కొత్తగా తీసుకువచ్చే రెవెన్యూ చట్టాన్ని పూర్తిగా విజయవంతం అయ్యేలా చూడడంలో కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన వౌలిక సదుపాయాలను కల్పించే అంశంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గ్రామ ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై చర్చిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే రెండు పర్యాయాలు గ్రామప్రగతి చేపట్టగా, మంచి ఫలితాలే వచ్చాయని భావిస్తున్నారు. అదే స్ఫూర్తితో త్వరలోనే పట్టణ ప్రగతి చేపట్టి విజయవంతం చేయాలని, ఇందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు. సంక్షేమ పథకాలు సక్రమంగా కొనసాగేందుకు కలెక్టర్లు పర్యవేక్షిస్తుండాలని భావిస్తున్నారు. రైతులకు సంబంధించి పంటలకు కనీస మద్దతు ధర వచ్చేలా చూడడం, నేత కార్మికుల సమస్యలు, గీత కార్మికుల సమస్యలపై చర్చిస్తారని తెలుస్తోంది. ప్రభుత్వం ఈ నెలలో అసెంబ్లీలో ప్రతిపాదించే 2020-21 సంవత్సరం బడ్జెట్‌పై కూడా చర్చిస్తారని తెలుస్తోంది. ప్రభుత్వం వివిధ శాఖలకు కేటాయించే నిధులు పూర్తిగా సద్వినియోగం అయ్యేలా చూడాలని, అన్ని శాఖల్లోనూ పొదుపు పాటించేందుకు తీసుకునే చర్యలపై కూడా చర్చిస్తారని తెలిసింది.