తెలంగాణ

మహా ఘట్టానికి తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 8: తెలంగాణ మహా కుంభమేళా శనివారం రాత్రితో ముగిసింది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర తల్లులు గద్దెపైకి చేరి మళ్లీ వనంప్రవేశం జరిగే వరకు కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు నాలుగు రోజుల పాటు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. దాదాపు కోటిన్నరకు పైగా భక్తులు హాజరైనట్లు ప్రభుత్వం భావిస్తోంది. శనివారం రాత్రి 7:04 గంటలకు సారలమ్మ తల్లి కనె్నపల్లికి పయనం కాగా, 7:08 గంటలకు కొండాయికి గోవిందరాజులు, 7:10 గంటలకు పూనుగొండ్లకు పగిడిద్దరాజు, 7:14 గంటలకు సమ్మక్కతల్లి చిలకలగుట్టకు పయనం కావడంతో మేడారం మహాజాతర ముగిసింది. వర్షంలోనూ అమ్మవార్లను పూజారులు తరలించారు. గిరిజన సాంప్రదాయ పద్ధతిలో డోలు, సన్నాయి వాయిద్యాల నడుమ అశేష భక్తజనావళి వీడ్కోలు మధ్య తల్లులు జనంలో నుండి వనంలోకి వెళ్లిపోయారు. అశేష భక్తజనకోటికి చల్లని దీవెనలు అందించిన మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులు వనప్రవేశం చేయడంతో మేడారం మహాజాతర అధికారికంగా ముగిసినట్టయింది.
ఈ నెల 5న కనె్నపల్లి నుండి సారలమ్మ తల్లి ఆగమనంతో మేడారం మహాజాతర ఘట్టం ఆరంభం కాగా చిలకలగుట్ట నుండి సమ్మక్కతల్లి, పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు, కొండాయి నుండి గోవిందరాజులు రావడంతో మేడారం మహాజాతరకు సంపూర్ణత చేకూరింది. గత నాలుగు రోజులుగా అమ్మవార్లు మేడారం తరలివచ్చిన లక్షలాది మంది భక్తులకు దీవెనలు అందించి శనివారం తమ స్వస్థలాలకు బయల్దేరారు. గిరిజన పూజారుల సాంప్రదాయాల నడుమ ఆలయాల్లో పూజలు నిర్వహించిన అనంతరం చిలకలగుట్టకు సమ్మక్కతల్లి, కనె్నపల్లికి సారలమ్మ తల్లులు పయనమయ్యారు. పూనుగొండ్లకు పగిడిద్దరాజు, కొండాయికి గోవిందరాజులు శనివారం సాయంత్రం మేడారం గద్దెల నుంచి స్వస్థలాలకు పయనమయ్యారు. అమ్మవార్ల వన ప్రవేశానికి పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా, ప్రతిసారి జరిగే మేడారం జాతర సందర్భంగా అక్కడ వర్షం పడడం కూడా ఆనవాయితీగా వస్తోంది. సరిగ్గా జాతర ముగిసేరోజే మేడారంలో భారీ వర్షం పడడం తల్లుల మహిమేనని భక్తుల నమ్మకం, భారీ వర్షంలోనే వన దేవతలను పూజారులు వన ప్రవేశం చేయించారు. తల్లుల వన ప్రవేశం సందర్భంగా పూజారులు ఆలకబూనడంతో వన ప్రవేశంలో కాస్త జాప్యం జరిగింది. వెంటనే మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే సీతక్క పూజారులతో జరిపిన చర్చలు సఫలం కావడంతో అమ్మవార్ల వన ప్రవేశంతో జాతర ముగిసింది. కాగా, మొట్టమొదటిసారిగా జాతర పూర్తిస్థాయిలో విజయవంతమైందని మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ ప్రకటించారు.

*చిత్రం... భక్తజన సందోహం మధ్య అమ్మవార్లను వన ప్రవేశానికి తీసుకెళ్తున్న దృశ్యం