తెలంగాణ

మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా సుధీర్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి న ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు శనివారం సంతకం చేశారు. రాష్ట్ర కేబినెట్ హోదా కలిగిన ఈ పదవిలో సుధీర్‌రెడ్డి మూడేళ్లపాటు కొనసాగుతారు. సుధీర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి ఎల్‌బీనగర్ ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేలలో 12 మంది కొంతకాలం కిందట టీఆర్‌ఎస్‌లో చేరారు. వారిలో సుధీర్‌రెడ్డి ఒకరు. కాంగ్రెస్ నుండి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలలో సబితారెడ్డి కి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పదవి కట్టబెట్టారు. ఇప్పుడు సుధీర్‌రెడ్డికి కేబినెట్ హోదా కల్పిస్తూ మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో సుధీర్‌రెడ్డి హైదరాబాద్ నగరాభివృద్ధి అథారిటీ (హుడా) చైర్మన్‌గా పనిచేశారు.
మూసీ నది అభివృద్ధికి ఇప్పటికే ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను రూపొందించింది. గుజరాత్‌లోని సబర్మతి నది తీరప్రాంత అభివృద్ధి సంస్థ చక్కగా పనిచేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఒక అధికారిక బృందాన్ని గతంలో గుజరాత్ పంపించింది. సబర్మతి
అభివృద్ధి కార్యక్రమాలను ఈ బృందం పరిశీలించి వచ్చింది. మూసీ నది కలుషితం కాకుండా చూడాలని, తెలంగాణ హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని ఇటీవల ఆదేశించింది. కోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో సుధీర్‌రెడ్డికి మూసీ అభివృద్ధి చైర్మన్ పదవి కట్టబెట్టారు.
*చిత్రం... ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి