తెలంగాణ

ముంచెత్తిన భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం/ ఏటూరునాగారం, ఫిబ్రవరి 8: మేడారాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ప్రశాంతంగా జాతర జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం భక్తులను తడిసి ముద్దచేసింది. లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకొని ఇంటి ముఖం పట్టే సమయంలోనే వర్షం రావడంతో భక్తజనం చెల్లాచెదురయ్యారు. అదే విధంగా అమ్మవార్ల వనప్రవేశానికి కూడా భారీ వర్షం ఆటంకంగా నిలిచింది. అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పూర్తిగా బురదమయం కావడంతో పూజారులు అలకబూని తరలింపు ప్రక్రియ ఆలస్యం చేయడంతో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే సీతక్కలు పూజారులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసి ప్రశాంతంగా అమ్మవార్ల వనప్రవేశం ప్రక్రియ జరిగేలా చొరవ చూపారు. అదే విధంగా భారీ వర్షం వల్ల జంపన్నవాగు సమీపంలో విద్యుత్ లైన్ తెగి కరీంనగర్ జిల్లా దురిశేడుకు చెందిన గంధం లక్ష్మీ (37) విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. వ్యాపారులు, దుకాణ సముదాయాల వారు తీవ్రంగా నష్టపోవాల్సివచ్చింది. ఉదయం నుండి ప్రముఖులు అమ్మవార్ల దర్శనానికి రావడంతోః సుమారు గంటకు పైగా భక్తులను క్యూలైన్‌లోనే నిలిపివేసి ప్రముఖుల దర్శనాల అనంతరం తిరిగి అమ్మవార్ల దర్శనానికి అనుమతించారు. మధ్యాహ్నం 2 గంటల అనంతరం భారీ వర్షం రావడంతో జాతర పరిసరాలు జలమయమయ్యాయి. తాత్కాళికంగా ఏర్పాటు చేసుకున్న గుడారాలన్నీ వర్షానికి తడిసి ముద్దయ్యాయి. ఎటువైపు చూసినా వర్షం నీరే కనిపించింది. గత నెల రోజులుగా కోటి మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకుని వ్యర్ధాలను వదిలేయడంతో ఇప్పటికే 10 కిలో మీటర్ల మేర దుర్గంధం వ్యాపిస్తోంది.