తెలంగాణ

విదేశాలకు విత్తనాల ఎగుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విత్తనోత్పత్తిలో భారతదేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని, విదేశాలకు నాణ్యమైన ఎగుమతులు చేస్తోందని తెలంగాణ రాష్ట్ర విత్తన సంస్థ డైరెక్టర్ డాక్టర్ కే. కేశవులు తెలిపారు. అంతర్జాతీయ ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) విత్తన విభాగం ప్రతినిధి సెబా గాస్పేర్‌తో పారిస్‌లో, అంతర్జాతీయ విత్తన సమాఖ్య (ఐఎస్‌ఎఫ్) సెక్రటరీ జనరల్ మైకేల్ కెల్లర్‌లతో జెనీవానగరంలోని వేర్వేరుగా కేశవులు సమావేశమయ్యారు. విత్తన పరిశ్రమ అభివృద్ధికి, రాష్ట్రాన్ని అంతర్జాతీయ విత్తన భాండాగారంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలను సీడ్ బౌల్ కార్యక్రమాలను ఓఈసీడీ, ఐఎస్‌ఎఫ్ అధికారులకు కేశవులు వివరించారు. నాణ్యమైన విత్తనోత్పత్తితో పాటు విత్తన నిలువ, ప్రాసెసింగ్, ప్యాకింగ్‌లకు కూడా తెలంగాణలో మంచి వాతావరణ పరిస్థితి ఉందన్నారు. దాదాపు 400 విత్తన కంపెనీలు సుమారు ఆరవేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయ ధృవీకరణ పద్దతి ద్వారా ఓఈసీడీ బాగాస్వామ్య దేశాలకు విత్తన ఎగుమతి చేస్తున్నామని వివరించారు. 2016 లో తెలంగాణ రాష్ట్రం దేశంలోని మొదటిసారిగా అంతర్జాతీయ విత్తన ధృవీకరణను అమలు చేసే రాష్ట్రంగా పేరు తెచ్చుకున్నదన్నారు. 2016-17 లో 7,240 క్వింటాళ్లు, 2017-18లో 8,028 క్వింటాళ్లు, 2018-19 లో 6,800 క్వింటాళ్ల వరి, మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు, సజ్జ తదితర విత్తనాలను ఈజిప్ట్, సూడాన్, ఫిలిప్పైన్స్, టాంజానియా, ఇటలీ తదితర దేశాలకు ఎగుమతి చేశామని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా ఓఈసీడీ ప్రతినిధి సెబా గాస్పేర్ మాట్లాడుతూ, విత్తనోత్పత్తిలో తెలంగాణ కొత్తపుంతలు తొక్కడం సంతోషంగా ఉందన్నారు. అంతర్జాతీయ విత్తన ధృవీకరణ (ఓఈసీడీ) పద్ధతిపై విత్తనోత్పత్తిదారులకు, విత్తన పరిశ్రమల ప్రతినిధులకు అంతర్జాతీయ విత్తన ప్రముఖులచేత శిక్షణ, అవగాహనా వర్క్‌షాప్‌లు నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు.
జెనీవాలో..
తెలంగాణ విత్తన పరిశ్రమ సామర్థ్యాన్ని అంతర్జాతీయ విత్తన సమాఖ్య (ఐఎస్‌ఎఫ్) అధికారులకు జెనీవాలో జరిగిన ఒక సమావేశంలో కేశవులు వివరించారు. భవిష్యత్తులో నాణ్యమైన విత్తనాన్ని ఎగుమతి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఐఎస్‌ఎఫ్ సెక్రటరీ జనరల్ మైకేల్ కెల్లర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.