తెలంగాణ

టీవోఏ పీఠం జయేష్ రంజన్‌కే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 9: తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీవోఏ) ఎన్నికల్లో అధ్యక్షునిగా రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ విజయం సాధించారు. 13 ఓట్ల మెజారిటీతో రంగారావుపై జయేష్‌రంజన్ గెలిచారు. జయేష్ రంజన్‌కు 46 ఓట్లు లభించగా, రంగారావుకు 33 ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో కే.రంగారావు, కే.జగదీశ్వర్ యాదవ్ ప్యానెల్ అధికంగా స్థానాలు గెలుచుకుని ఘనవిజయం సాధించింది. లాల్‌బహదూర్ స్టేడియంలోని తెలంగాణ ఒలింపిక్ భవన్‌లో జరిగిన ఈ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శి పదవి కోసం జరిగిన పోటీలో తెలంగాణ కబడ్డీ సంఘం కార్యదర్శి కే.జగదీశ్వర్ యాదవ్ కేవలం రెండు ఓట్ల తేడాతో జయేష్ రంజన్ ప్యానెల్‌కు చెందిన తెలంగాణ హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడు ఎ.జగన్‌మోహన్ రావుపై విజయం సాధించింది. జగదీశ్వర్ యాదవ్‌కు 41 ఓట్లు లభించగా, జగన్‌మోహన్ రావుకు 39 ఓట్లు వచ్చాయి. సంయుక్త కార్యదర్శి కోసం నాలుగు స్థానాలకు గాను ఏడు మంది అధ్యర్థులు పోటీలో నిలిచారు. సంయుక్త కార్యదర్శిగా విజయం సాధించిన వారిలో తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ సంఘం అధ్యక్షుడు పీ.మల్లారెడ్డి, తెలంగాణ బాస్కెట్‌బాల్ సంఘం కార్యదర్శి నార్మన్ ఇషాక్, ఎం.రామకృష్ణ, ఏ.సోమేశ్వర్ ఉన్నారు. కోశాధికారి కోసం జరిగిన పోటీలో ఇద్దరు మహేశ్వర్, ఫణిరావు పోటీలో నిలిచారు. జగదీశ్వర్ యాదవ్ ప్యానెల్ సభ్యుడు మహేశ్వర్‌కు 46 ఓట్లు లభించగా, ఫణిరావుకు 31 ఓట్లు లభించాయి. ఈ క్రమంలో అత్యధికంగా జయదీశ్వర్ యాదవ్ గ్రూప్ అభ్యర్థులు ఎన్నికల్లో గెలుపొందారు. కాగా, 81 అభ్యర్థుల ఓట్లు కీలంగా మారాయి. ఉపాధ్యక్ష పదవి కోసం జరిగిన పోటీలో మహ్మద్ అలీ రఫ్‌త్, ఎస్‌ఆర్.ప్రేమ్‌రాజ్, సరల్ తల్వార్, డాక్టర్ ఎస్. వేణుగోపాలచారి గెలుపొందారు. కోశాధికారి కోసం ఎన్నికలో రంగారావు ప్యానెల్ అభ్యర్థి కే.మహేశ్వర్ 15 ఓట్ల తేడాతో ప్రత్యర్థి ఫణిరావు నెగ్గారు. మహేశ్వర్‌కు 46 ఓట్లు రాగా, ఫణిరావుకు 31 ఓట్లు లభించాయి. ఉపాధ్యక్ష పదవి నాలుగు పోస్టులకు గాను ఐదుగురు ప్రతినిధులు డాక్టర్ ఎస్.వేణుగోపాలచారి, సరల్ తాల్వర్, ఎస్‌ఆర్.ప్రేమ్‌రాజ్, డాక్టర్ మహ్మద్ అలీ రఫత్, పీ.ప్రకాష్ రాజు పోటీ చేయగా ప్రకాష్‌రాజ్ ఓటమి పాలయ్యారు. కాగా, 15 మంది కార్యవర్గ సభ్యుల కోసం 19మంది పోటీలో నిలిచారు. తెలంగాణ ఒలింపిక్ సంఘం కార్యవర్గ కమిటీ సభ్యులుగా నియమితులైన వారిలో అబ్బాస్, దత్తాత్రేయ, మహేందర్ రెడ్డి, పురుషోత్తం, రాంకోటేశ్వరరావు, స్వామి రామకృష్ణ, ఇస్మాయిల్ బేగ్, హంజా బీన్ ఉమర్, ఖాజా ఖాన్, రాజేంద్ర ప్రసాద్, అజీజ్ ఖాన్, లింగయ్య, మనోహర్‌లు గెలుపొందారు. ఈ సందర్భంగా టీఓఏ ప్రభాన కార్యదర్శిగా ఎన్నికైనా జగదీశ్వర్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. క్రీడల్లో గెలుపోటములు సాధారణమేనని, ప్రతి క్రీడా సంఘం ప్రతినిధులతో కలిసి రాష్ట్రంలో క్రీడా రంగం అభివృద్దికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. టీఓఏ ఎన్నికల్లో తమను బలపరిచిన ప్రతి ఒక్కరికీ జగదీశ్వర్ యాదవ్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.