తెలంగాణ

సమాచార చట్టం కమిషనర్లుగా ఐదుగురి నియామకం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 9: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం సమావేశమైన సమాచార హక్కు చట్టం కమిషనర్ల ఎంపికకు ఏర్పాటైన సెర్చ్ కమిటీ ఐదుగురిని ఎంపిక చేసినట్టు తెలిసింది. సెర్చ్ కమిటీ ఎంపిక చేసిన కమిషనర్ల నియామకాలను గవర్నర్ తమిళిసై ఆమోదం లభించాక అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా కట్టా శేఖర్‌రెడ్డి, నారాయణరెడ్డి, గగులోతు శంకర్‌నాయక్, అమీర్, ఖలీలుల్లా ఉన్నట్టు తెలిసింది. మొత్తంగా ఒక చీఫ్ కమిషనర్, తొమ్మిది మంది కమిషనర్లను నియమించుకోవాల్సి ఉంది. అయితే, రెండు సంవత్సరాల క్రితమే చీఫ్ కమిషనర్ రాజా సదారామ్, కమిషనర్‌గా బుద్దా మురళిని ప్రభుత్వం నియమించింది. మిగిలిన ఖాళీల కోసం సెర్చ్ కమిటీ తాజాగా మరో ఐదుగురిని కమిషనర్లుగా ఎంపిక చేసినట్టు తెలిసింది. ఎంపికైన వారిలో ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారు. కట్టా శేఖర్‌రెడ్డి నమస్తే తెలంగాణ తెలుగు దిన పత్రిక ఎడిటర్ కాగా.. నారాయణరెడ్టి టీ-న్యూస్ చానల్ సీఈవోగా పని చేస్తున్నారు. మిగతా ముగ్గురిలో ఇద్దరు మైనార్టీలు, ఒకరు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు.