తెలంగాణ

ప్రభుత్వ విప్‌గా గంపా బాధ్యతల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 9: శాసనసభ ఆవరణలో ఏర్పాటు చేసిన తన చాంబర్‌లో ప్రభుత్వ విప్‌గా నియామకమైన కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్ ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు బీబీ పాటిల్, శాసనసభ కార్యదర్శి వేదాంతం నరసింహాచార్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పదవీ బాధ్యతల స్వీకరణకు ముందు వేద పండితులు చాంబర్‌లో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా, నిరాడంబర వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి గంప గోవర్దన్‌రెడ్డి అని కొనియాడారు. గంప గోవర్దన్ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని మంత్రి ఆకాంక్షించారు. తమ జిల్లా తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. తనను రెండోసారి ప్రభుత్వ విప్‌గా నియమించడం పట్ల గంప గోవర్దన్ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు, పలువురు ప్రజా ప్రతినిధులు హాజరై గంప గోవర్దన్‌కు పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలియజేశారు.

*చిత్రం...శాసనసభ ఆవరణలోని చాంబర్‌లో ప్రభుత్వ విప్‌గా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే గంప గోవర్దన్