తెలంగాణ

నేడు కలెక్టర్ల సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మంగళవారం నిర్వహించే జిల్లా కలెక్టర్ల సమావేశానికి ప్రగతిభవన్ సిద్ధమైంది. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. సమావేశం అజెండాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తొలుత చదివి వినిపిస్తారు. ఇప్పటికే అజెండా అంశాలను కలెక్టర్లకు పంపించారు. దాని ఆధారంగానే వారు అవసరమైన సమాచారంతో రానున్నారు. అజెండాలో లేని అంశాలు ఏవైనా ముఖ్యమైనవి ఉంటే తన దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ సోమేష్ కుమార్ కోరతారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. 33 జిల్లాల నుండి వస్తున్న కలెక్టర్లలో 21 మంది కలెక్టర్లు జిల్లాల్లో ఇటీవలే కొత్తగా బాధ్యతలు స్వీకరించినవారు కావడం గమనార్హం. రాష్టస్థ్రాయిలో ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో పాటు వివిధ శాఖల కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు హాజరవుతున్నారు. పంచాయతీరాజ్ చట్టం, పురపాలక చట్టం ఏ విధంగా అమలు చేయాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా కలెక్టర్లకు వివరిస్తారు. గ్రామాలు, పట్టణాలు, నగరాలు సమానంగా అభివృద్ధి కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా తాగునీటి వసతికి సంబంధించి మిషన్ భగీరథ, పారిశుధ్యం, అంతర్గత రోడ్ల పరిస్థితి, విద్యుత్ దీపాల పరిస్థితిపై సమీక్షిస్తారని తెలిసింది. పారిశుధ్యానికి సంబంధించి ఇళ్ల నుండి సేకరిస్తున్న చెత్తను డంపింగ్ యార్డులకు చేరవేయడం, ఆ తర్వాత శాస్ర్తియంగా ఈ చెత్తను ఉపయోగించడంపై సమీక్షిస్తారని తెలిసింది. అదేవిధంగా పల్లె ప్రగతిపై ప్రధానంగా చర్చిస్తారు. ఇటీవల చేపట్టిన గ్రామ ప్రగతికి సంబంధించి మంచి చెడులపై సమగ్రంగా చర్చిస్తారని తెలిసింది. జిల్లా కలెక్టర్లు కూడా పల్లె ప్రగతిపై సమగ్ర సమాచారాన్ని తీసుకువస్తున్నట్టు భోగట్టా. ఇటీవల ప్రత్యేక అధికారులు గ్రామాలకు వెళ్లి పల్లె ప్రగతిపై తనిఖీ చేసిన తర్వాత పరిస్థితిపై కూడా సమీక్షిస్తారని తెలిసింది. అలాగే త్వరలో చేప్టబోయే పట్టణ ప్రగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తన మనోభావాలను కలెక్టర్లతో పంచుకుంటారని తెలిసింది. పల్లె ప్రగతికి
తీసిపోకుండా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుండడంతో దీనిపై కూడా సమగ్రంగా చర్చ జరుగుతుందని తెలుస్తోంది. ఇక వ్యవసాయానికి సంబంధించిన అంశాలు, సంక్షేమ, అభివృద్ధి పథకాలు, పింఛన్ల పంపిణీ, గృహ నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు తీరు తెన్నులపై కూడా సమీక్షిస్తారని తెలిసింది. అందుకే జిల్లా కలెక్టర్లంతా తమ తమ జిల్లాల్లో కొనసాగిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాల గురించిన సమగ్ర సమాచారంతో వస్తున్నారు. రెవెన్యూ చట్టంపై కూడా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కలెక్టర్లు తమ మనోభావాలను వెల్లడించే అవకాశం ఉంది. ఇలాఉండగా విద్య, వైద్య రంగాల్లో చేపడుతున్న పనుల గురించి కూడా చర్చిస్తారని తెలిసింది. ప్రజలందరికీ వైద్య సౌకర్యాలు కల్పించడంపై చేపట్టిన కార్యక్రమాలపై కూడా చర్చించనున్నట్టు తెలిసింది. ఈ సమావేశానికి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు ఇతర మంత్రులు కూడా హాజరవుతారని తెలిసింది.

*చిత్రాలు.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, సీఎస్ సోమేష్ కుమార్