తెలంగాణ

తెలంగాణ ఉద్యమకారులకు జాక్‌పాట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని వివిధ కేసులను ఎదుర్కొంటున్న ఉద్యమకారులను ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. నియోజకవర్గాల వారీగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి ఎంపిక చేసే బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించింది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేల నుంచి అందిన ఉద్యమకారుల జాబితాకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరయ్యాయి. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున చెక్కులను అందజేసే కార్యక్రమానికి ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 67 మంది ఉద్యమకారులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ గుర్తించి చేసిన సిఫారసు మేరకు మంజూరైన రూ.25.57 లక్షల విలువ గల చెక్కులను ఆదివారం ఖమ్మంలో తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అందజేశారు. ఇలాఉండగా తెలంగాణ సాధన ఉద్యమంలో రాజకీయ పార్టీలకు చెందినవారే కాకుండా వివిధ ప్రజాసంఘాల కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. పైగా సీఎంఆర్‌ఎఫ్ నుంచి
చెక్కులను అందుకుంటున్న వారిలో ఒక్క టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారికే ఆర్థిక సహాయం అందజేస్తున్నారని, తాము కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అనేక కేసులను ఎదుర్కోగా తమకు ఎందుకు ఇవ్వడం లేదని ఇతర పార్టీలకు చెందిన వారి నుంచి విమర్శలు వస్తున్నాయి. గతంలో తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేసినప్పుడు పార్టీలకు అతీతంగా ఇచ్చారని వారు గుర్తు చేస్తున్నారు. అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడానికి బడ్జెట్‌లోనే ప్రభుత్వం నిధులు కేటాయించింది. అయితే కేసులను ఎదుర్కొంటున్న ఉద్యమకారులకు అందజేస్తున్న ఆర్థిక సహాయాన్ని సీఎంఆర్‌ఎఫ్ నుంచి నిధులు కేటాయించడం విశేషం. నిబంధనల ప్రకారం సీఎంఆర్‌ఎఫ్ నుంచి నిరుపేదలకు మాత్రమే ఆర్థిక సహాయాన్ని అందించాలి. ఆరోగ్య సమస్యలతో ఖరీదైన వైద్యం పొందలేని పేదలకు కానీ, కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయిన పక్షంలో కానీ, ప్రకృతి వైపరీత్యాల వల్ల జీవనోపాధి, ఆస్తులను కానీ కోల్పోయినా, రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాద క్షతగ్రాతులకు మాత్రమే సీఎంఆర్‌ఎఫ్ నుంచి ఆర్థిక సహాయం పొందడానికి అర్హులుగా పేర్కొన్నారు. కాగా, ఈ నిధుల నుంచి ఉద్యమకారులకు ఆర్థిక సహాయాన్ని ఏవిధంగా ఇస్తారన్నది మరో ప్రశ్న. ఇలాఉండగా ఉద్యమం సందర్భంగా కేసులను ఎదుర్కొన్న వారిలో ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నా, అలాంటివారు త్వరలో నామినేటెడ్ పోస్టులు పొందబోతున్నా ఈ జాబితా నుంచి మినహాయించినట్టు సమాచారం.

*చిత్రం... ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎంపికైన తెలంగాణ ఉద్యమకారులకు ఖమ్మంలో చెక్కులను అందజేస్తున్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో పాటు టీఆర్‌ఎస్ నేతలు