తెలంగాణ

గాంధీ ఆసుపత్రి వైద్యుడిపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, ఫిబ్రవరి 10: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా అనుమానిత లక్షణాల వ్యక్తులకు నిర్వహించిన వైద్య పరీక్షలకు సంబంధించి లీకులిచ్చి, ప్రజల్లో లేనిపోని భయాన్ని సృష్టించాడంటూ గాంధీ ఆసుపత్రి వైద్యుడికి అధికారులు వేటు వేశారు. రోజు వారి కార్యకలాపాలలో అలసత్వం వహించడం, ఇతరుల విధులకు ఆటంకం కలిగించినందుకు ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగం చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.వసంత్ కుమార్‌ను జిల్లా వైద్యారోగ్యశాఖకు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ విషయాన్ని గాంధీ సూపరింటెండెంట్ డా. శ్రావణ్ కుమార్ కూడా నిర్దారించారు.
ఈ నెల 7న కరోనా ప్రత్యేక వార్డులు సిబ్బంది నియామకం, ఏర్పాట్లపై నోడల్ అధికారి డా.టీ.ప్రభాకర్ రెడ్డి, ఆర్‌ఎంఓ జయకృష్ణ. నర్సింగ్ సూపరింటెండెంట్ మంగమ్మ, పేషీ అధికారి యాదిలాల్ ఇతర సిబ్బందితో చర్చిస్తుండగా అక్కడికి చేరుకున్న డా. వసంత్ కుమార్ సమావేశాన్ని భగ్నం చేస్తూ అక్కడ శుభ్రత లేదని, అక్కడ నర్సులు లేరు మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారంటూ ఆర్‌ఎంఓ డా. జయకృష్ణపై విరుచుకు పడినట్లు తెలిపారు. ఒక వైపు కరోనాను ఎదురుకోవడంపై పూర్తిగా నిమగ్నమై, ఎంతో వత్తిడితో పనిచేస్తున్న వారిపై డా.వసంత్ వ్యవహారించిన తీరును అందరూ తప్పుబట్టారు. ఏదైనా సమస్య ఉంటే లిఖిత పూర్వకంగా పర్యాదు చేయాలి, లేదా నిధానంగా, అర్ధమయ్యేలా చెప్పాలి కానీ ఇలా ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎలా? అంటూ కొందరు అధికారులు ఆయన్ను అక్కడి నుంచి పంపించేసినట్లు వివరించారు.
ఈ ఘటనను పాలనా యంత్రాగమంతా తీవ్రంగా పరిగణించి, జరిగిన విషయాన్ని వివరిస్తూ డీఎంఈ రమేష్ రెడ్డికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయటంతో, దాన్ని పరిశీలించిన ఉన్నతాధికారులు డా.వసంత్‌పై సోమవారం చర్యలు తీసుకుంటూ, ఆయన్ను వైద్య శాఖకు సరెండర్ చేసినట్లు తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన కేంధ్ర ఇంటెలిజన్స్ విభాగం అధికారులకు గాంధీలో ఇద్దరు కరోనా పాజిటీవ్ రోగులు చికిత్స పొందుతున్నారని తప్పుడు సమాచారం ఇచ్చి, తనకు సంబంధం లేని విషయాలలో తలదూర్చి ఇతరుల పనులకు ఆటంకం కలిగించడం లాంటి అనేక ఆరోపణలున్న నేపధ్యంలో డా.వసంత్‌ను సరెండర్ చేశారని, ఇకపై ఆయనకు గాంధీ ఆసుపత్రికి ఎలాంటి సంబంధం లేదని డా.శ్రావణ్ స్పష్టం చేశారు.
కరోనా వీఐపీ వార్డు
కరోనా అనుమానిత లక్షణాలతో వచ్చే కొందరు ప్రముఖులు, వీఐపీలకు పెయింగ్ వార్డులను ఏర్పాటు చేసినట్లు అసుపత్రి సూపరింటెండెంట్ డా.శ్రావణ్‌కుమార్ వెల్లడించారు. ఆసుపత్రిలోని ఏడవ అంతస్తులో ఇరవై ఏడు పడకలతో మూడు ఐసోలేటెడ్ వార్డులు, స్వైన్ ఫ్లూ వార్డు పక్కనే 10 పడకలతోమరొ వార్డు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఇందులో ఐదు పడకలతో ఒక వార్డును వీఐపీ రోగుల కోసం కేటాయించనున్నట్లు వెల్లడించారు. కరోనా కోసం నోడల్ అధికారిగా డా. టీ ప్రభాకర్ రెడ్డి పదకొండు మంది ఆర్‌ఎంఓలు, తొమ్మిది మంది స్పెషలిస్టులు, ఐదు మంది ఎస్‌ఆర్‌లు, 20మంది నర్సులు, ఏడుమంది ల్యాబ్ టెక్నిషియన్లు రౌండ్‌దీ క్లాక్ షిఫ్ట్‌ల వారిగా అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. పేషెంట్ కేర్ ప్రొవైడర్స్ 12మంది, హెల్ప్‌డెస్క్‌లో పని చేయడానికి ఆరుమంది రౌండ్ ది క్లాక్ నియమించినట్లు తెలిపారు.