తెలంగాణ

వరుస భూకంపాలతో వణుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేళ్లచెర్వు, ఫిబ్రవరి 10: సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పలు గ్రామాల్లో సంభవిస్తున్న వరుస భూకంపాలతో ప్రజలు వణికిపోతున్నారు. తాజాగా ఆదివారం రాత్రి భూప్రకంపనలు చింతలపాలెం, మేళ్లచెర్వు మండలాల్లో చోటుచేసుకోవడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రిక్టర్‌స్కేలుపై 3.3 భూకంప తీవ్రత నమోదైనట్టు తహశీల్దార్ కమలాకర్ తెలిపారు. నిద్రలేని రాత్రులు గడుపుతూ ఏక్షణాన ఏం జరుగుతుందోనని కొందరు రాత్రి పూట ఆరుబయటే నిద్రిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఎన్‌జీఆర్‌ఐ శాస్తవ్రేత్తల బృందం పలు దఫాలుగా క్షేత్రస్థాయిలో పర్యటించి దొండపాడు, వెల్లటూరు గ్రామాల్లో రిక్టర్‌స్కేలును అమర్చారు. ప్రజలు భయాందోళన చెందవద్దని ఆస్తి, ప్రాణనష్టం సంభవించే విధంగా భూకంపాలు ఈప్రాంతంలో రావని శాస్తవ్రేత్తలు ప్రజలకు భరోసానిచ్చారు. అయితే రోజుకు పదుల సంఖ్యలో భూప్రకంపనలు రిక్టర్ స్కేలుపై నమోదవుతున్నాయి. ఈనెల 9, 10 తేదీల్లో మొత్తం 73 సార్లు భూప్రకంపనలు వచ్చినట్టు రిక్టర్‌స్కేలుపై నమోదైందని అధికారులు తెలిపారు. అయితే భూప్రకంపనలు అతి కనిష్టస్థాయి నుండి ఇప్పటి వరకు గరిష్టస్థాయిలో జనవరి 25వ తేదీన 5.4గా నమోదైంది. ఇటీవల సంభవించిన భూప్రకంపనలకు చింతలపాలెంలో రెండు గృహల పైకప్పుకు బీటలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కేంద్రస్ధాయిలో శాస్తవ్రేత్తలు స్పందించి చింతలపాలెం మండలంలోని పలు గ్రామాలను పూర్తిస్థాయిలో పరిశీలించి జాగ్రత్తలు సూచించాలని ప్రజలు కోరుతున్నారు.