తెలంగాణ

ముగిసిన బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 10: యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం అష్టోత్తర శతఘటాభిషేకం, ఋత్విక్ సన్మానంతో ముగిశాయి. ఉదయం ఆలయంలో మూలవరులకు ఉత్సవ వరులకు పాంఛరాత్రగమశాస్త్రానుసారం వేదపారాయణ, పఠనాథులతో అష్టోత్తర శతఘటాభిషేక కైంకర్యం నిర్వహించారు. స్వామిఅమ్మవార్లకు పంచామృతాలతో, ఫలరసాలతో, పరిమళ సుగంధ ద్రవ్యాలతో, మంత్రపూర్వక జలములతో అభిషేకించారు. అనంతరం బ్రహ్మోత్సవాల నిర్వహణ ప్రక్రియను దిగ్విజయంగా నిర్శహించిన యాజ్ఞాచార్యులు, పారాయణీకులు, అర్చక పండితులను ఘనంగా సన్మానించి మహాదాశీర్వాచనం, మంగళనీరాజనములతో ఉత్సవ సమాప్తి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గీత, స్థానాచార్యులు రాఘవాచార్యులు, ప్రధానార్చకులు కారంపూడి నరసింహాచార్యులు, కాండూరు వెంకటార్యులు, ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఏఈవో కృష్ణగౌడ్ పాల్గొన్నారు.
*చిత్రం... అష్టోత్తర శత ఘటాభిషేక దృశ్యం