తెలంగాణ

వీఆర్‌ఏ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: నేరుగా నియామకం అయిన గ్రామ రెవెన్యూ సహాయకుల (విఆర్‌ఏ) సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని, అవసరాన్ని అనుసరించి ఇతర శాఖల్లో తమ సేవలను ఉపయోగించుకోవాలని వీఆర్‌ఏలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్‌ఏలంతా లిఖిత పూర్వకంగా ప్రభుత్వానికి సోమవారం లేఖలు అందచేశారు. జిల్లాల వారీగా వీఆర్‌ఏల సంఘాల తరఫున కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చారు. ఈ వినతిపత్రాలను ముఖ్యమంత్రికి చేరేలా చూడాలని అన్ని జిల్లాల్లోనూ వీఆర్‌ఏల జిల్లా ప్రతినిధులు కోరారు. 2012 లో ఏపీపీఎస్‌సీ ద్వారా తాము నియామకం అయ్యామని, తమలో ఉన్నత చదువులు చదుకున్న వారు చాలా మంది ఉన్నారని గుర్తు చేశారు. వీఆర్‌ఏల సర్వీసును క్రమబద్దీకరిస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ 2017 ఫిబ్రవరి 24 న మహాశివరాత్రి సందర్భంగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి హామీ ఇచ్చి మూడేళ్లు గడుస్తోందని, ఇప్పటికైనా తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలంటూ వీఆర్‌ఏల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు జిన్నారం వెంకటేశం యాదవ్, వ్యవస్థాపక అధ్యక్షుడు రమేష్ బహదూర్, గౌరవ అధ్యక్షుడు వింజమూరి ఈశ్వర్ కోరారు. ఈ మేరకు వీరు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదిస్తున్న రెవెన్యూ కొత్త చట్టాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. వెంటనే తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని వారు వీఆర్‌ఏల సంఘం నేతలు కోరుతున్నారు.
*చిత్రం...ఖమ్మం కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న వీఆర్‌ఏలు