తెలంగాణ

ఇరాక్‌లో ఎన్ని కష్టాలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఫిబ్రవరి 10: బతుకు బాట..ఉపాధి వేటలో..ఇరాక్ దేశానికి పయనమైన భారతీయులు అక్కడ అనుభవిస్తున్న బాధలను ఒక్కొక్కటిగా ‘ఆంధ్రభూమి’ ప్రతినిధి దృష్టికి సోమవారం తీసుకువచ్చారు. చేతినిండా పనిదొరకక, చేసిన పనికి జీతాలివ్వక అర్థాకలితో అలమటిస్తున్నామని, ఎదిరిస్తే చీకటి గదుల్లో బంధించి చుక్కలు చూపిస్తున్నారంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సారంగాపూర్, బీర్‌పూర్ మండలాలకు చెందిన దానం రాజు, కంది రమేష్, రుద్దుల సత్తయ్య, దుక్కి రాకేష్, బండారి సురేష్, రమేష్, రుద్రపల్లి రాజ్‌కుమార్ వెల్లడించారు. కరీంనగర్ జిల్లాతో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన అనేకమంది ఇరాక్ దేశానికి ఉపాధి కోసం వచ్చి కంపెనీల్లో పనిలేక లభించక, ఇతర చోట పనిచేసుకుంటూ కంపెనీ గతంలో చూపించిన చోటే తలదాచుకుంటున్నారు. తొమ్మిది నెలలుగా వేతనాలు చెల్లించకుండా ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీ వేధింపులకు పాల్పడుతూ తలదాచుకున్న చోటు నుంచి కూడా తరిమేసే యత్నాలు ముమ్మరం చేసింది. చీకటి గదుల్లో బంధించి ఆకలవుతుందని కేకలు వేసినా పట్టించుకోవట్లేదని పలువురు బాధితులు గల్ఫ్ రిటర్నింగ్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ చాంద్‌పాషా ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇమిగ్రేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఫలితం లేదని అన్నారు. క్యాలెండర్‌లో సంవత్సరాలు మారుతున్నా వలస కార్మికుల బతుకుల్లో మార్పు రావట్లేదని, స్వరాష్ట్రం వచ్చినా గల్ఫ్‌దేశాల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు నరకయాతన అనుభవిస్తూనే ఉన్నారు. స్వదేశానికి తిరిగొస్తే చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక మరికొందరు అక్కడే చాటుమాటుగా పనులు చేసుకుంటూ వందలాది మంది జైళ్లలో మగ్గుతున్నారు. అక్కడ మరణించిన భారతీయుల మృతదేహాలను స్వదేశానికి రప్పించడం పెద్ద సమస్యగా మారింది.
వందలాది మంది గల్ఫ్ శవపేటికలు తెలంగాణ రాష్ట్ర పల్లెల్లోకి చేరుతూనే ఉన్నాయి. పెద్దదిక్కు కోల్పోయిన కుటుంబాల బతుకులు తెల్లారిపోతున్నాయి. గల్ఫ్ వలస కార్మికుల రక్షణ, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఐ పాలసీని ప్రకటించడంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. వలస కార్మిక కుటుంబ సభ్యులు నష్టపోతున్నారు. ఎన్‌ఆర్‌ఐ పాలసీ అమలైతే ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చనే ఆశపడిన వారికి ఎదురుచూపులే మిగులుతున్నాయి. తెలంగాణ సంక్షేమం పేర 2014లో తెరాస ఎన్నికల మేనిఫెస్టో పేజీ నెం.22లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడిపెంచారు. ఈక్రమంలో మంత్రి కేటీఆర్ 2016 జూలై 27న హైదరాబాద్‌లో విస్తృతస్థాయి ఎన్‌ఆర్‌ఐ పాలసీ సమావేశం నిర్వహించారు.
ముసాయిదా పత్రాలను రూపొందించి సాధారణ పరిపాలన, పరిశ్రమల శాఖల హోం ఐటీ, కార్మిక, ఆర్థిక నైపుణ్య అభివృద్ధి, సాంస్కృతిక పర్యాటక తదితర శాఖలకు పంపించారు. ఆయా శాఖల సూచనలు పరిగణలోకి తీసుకొని చివరకు ముసాయిదా బిల్లులను రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ టేబుల్‌పై ఉంచారు.
ఇప్పటికీ ఎన్‌ఆర్‌ఐ అమలుకు గల్ఫ్ వలస కార్మికులు ఎదురు చూస్తున్నారు. విదేశాలకు వలస వెళ్లిన కూలీలు, ఉద్యోగులు ప్రభుత్వం చేయబోయే కార్యక్రమాలను అనుసరించి సమగ్ర రూపంలోకి తేవాల్సిన ఎన్‌ఆర్‌ఐ పాలసీపై స్వరాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ప్రభుత్వపరంగా వలస కార్మిక సంక్షేమానికి మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేయాలని తలపెట్టారు. కాగా, గల్ఫ్ ఏజెంట్ల వలకు చిక్కిన అనేక మంది భారతీయులు పరాయి దేశాల్లో పడరాని పాట్లు పడుతూ, అరిగోస అనుభవిస్తూ చేతులు కాల్చుకొని ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తూ ఆదుకోవాలంటూ వేడుకొంటుండడం గమనార్హం.

*చిత్రం...ఇరాక్ దేశంలోని చీకటి గదుల్లో నరకయాతన అనుభవిస్తూ తమను ఆదుకోవాలంటూ వేడుకుంటున్న భారతీయులు