తెలంగాణ

తెలుగు భాషాభ్యాసన సౌకర్యాలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: మైసూరులోని భారతీయ భాషా సంఘం దక్షిణ ప్రాంతీయ కేంద్రం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్తంగా తెలుగేతర ఉపాధ్యాయులకు తెలుగు నేర్పించే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమం ద్వారా తెలుగు నేర్చుకున్న ఉపాధ్యాయులు మంగళవారం నాడు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. రాష్ట్రేతరులు తెలుగు భాష నేర్చుకున్న తీరును గవర్నర్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తనకూ తెలుగు నేర్పించాలని తెలుగు యూనివర్శిటీ
అంతర్జాతీయ కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ వీ సత్తిరెడ్డిని కోరారు. మూడు రోజుల పాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో రాష్ట్రేతర తెలుగు అభ్యాసకుల కోసం పలు కార్యక్రమాలను నిర్వహించారు. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుండి వచ్చిన ఉపాధ్యాయులు తెలుగులో పొందిన ప్రావీణ్యాన్ని చూసిన గవర్నర్ తమిళిసై తెలుగు నేర్పించేందుకు ఏర్పాట్లు చేయాలని సత్తిరెడ్డిని గవర్నర్ కోరారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కోర్సు సమన్వయకర్త డాక్టర్ జీ ప్రభాకర్, అధ్యాపకులు బీ వేంకటేశ్వర్లు, ఆచార్య వీ సత్తిరెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు తెలుగు యూనివర్శిటీలో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్తిరెడ్డి మాట్లాడుతూ తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంపొందించేందుకు తెలుగు యూనివర్శిటీ అంతర్జాతీయ కేంద్రం కృషి చేస్తోందని అన్నారు. కోర్సు సమన్వయకర్త డాక్టర్ జీ ప్రభాకర్ మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల నుండి ఎంపికైన అధ్యాపకులకు రాష్ట్రేతర భాషలను నేర్పించడానికి ప్రత్యేకించి 10 నెలల కాలవ్యవధితో ఆయా భాషలపై శిక్షణా తరగతులను ఏర్పాటు చేయడానికి మైసూరులోని భారతీయ భాషా సంస్థ దక్షిణ ప్రాంతీయ కేంద్రం విశేష కృషి చేస్తోందని అన్నారు.

*చిత్రం...గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసిన తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల తెలుగు ఉపాధ్యాయులు