తెలంగాణ

డెడ్‌లైన్ 25 రోజులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: ‘పాతిక రోజుల్లో గ్రామాల రూపురేఖలు మారాలి. ఆలోగా పదిహేను రోజుల్లో జిల్లా స్థాయిలో ‘పంచాయతీరాజ్ సమ్మేళనం’ నిర్వహించాలి. అందులో గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి పర్చుకోవాలో విడమరిచి చెప్పాలి. సర్పంచ్‌లు, కార్యదర్శులకు విధులు, బాధ్యతలను తెలియజేయాలి. ఆ తర్వాత పది రోజుల గడువు ఇచ్చి రాష్టవ్య్రాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. ఫ్లయింగ్ స్క్వాడ్‌లు పర్యటిస్తాయి. నేను కూడా ఆకస్మిక పర్యటనలు చేస్తా. ఏ గ్రామంలోనైనా అనుకున్న విధంగా మార్పు కనిపించకపోతే చర్యలు తప్పవు’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. ‘ప్రభుత్వం తన అధికారాలు వదులుకుని కలెక్టర్లకు బదిలీ చేసింది. ప్రభుత్వపరంగా చేయాల్సిదంతా చేసింది. ఇంత చేసినా గ్రామాల్లో మార్పు రాకుంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు’ అని సీఎం స్పష్టం చేశారు. ప్రగతిభవన్‌లో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మంత్రులు, సీనియర్ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు ప్రభుత్వ ప్రాధాన్యతలు, బాధ్యతలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ‘కలెక్టర్ల వ్యవస్థను బలోపేతం
చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కలెక్టర్లకు అండగా ఉండడానికి అదనపు కలెక్టర్లను నియమించింది. జిల్లా స్థాయిలో ప్రభుత్వ ప్రతినిధిగా కలెక్టర్లు వ్యవహరించాలి. కలెక్టర్లపై ఎంతో నమ్మకం ఉంచింది. అదే సందర్భంలో కలెక్టర్లకు ఎంతో బాధ్యత ఉంది. గతంలో 112 కమిటీలకు చైర్మన్‌గా ఉన్న కలెక్టర్లు చైర్మన్లుగా వ్యవహరించేవారు. ఇప్పుడు వాటిని 26 విభాగాలుగా చేయడం వల్ల పని ఒత్తిడి తగ్గుతుంది. కలెక్టర్లకు సహాయకారిగా ఉండేందుకు అదనపు కలెక్టర్లను నియమించాం. వారికి పూర్తిగా స్థానిక సంస్థలకు కేటాయించాం. వాటిని సమర్థవంతంగా పని చేయించే బాధ్యతలు మాత్రమే నిర్వర్తించాలి’ అన్నారు. మొక్కలు నాటడం, వాటిని పరిరక్షించడం మంత్రులు, కలెక్టర్ల బాధ్యత. ఇది వారి పనితీరుకు గీటురాయి కూడా. మొక్కలు నాటడం, సంరక్షించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని సీఎం హెచ్చరించారు. ‘విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు అప్పగించాం. నేరుగా కోర్టుకు వెళ్లకుండా ట్రిబ్యునల్ ఏర్పాటు చేశాం’ అని సీఎం గుర్తుచేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను అమలు చేయడమే జిల్లా యంత్రాంగం ప్రాధాన్యత అయి ఉండాలి తప్ప, ఇందులో ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉండరాదని సీఎం స్పష్టం చేశారు. విస్తృత మేథోమధనం, చర్చోపచర్చలు, అసెంబ్లీలో విస్తృత చర్చ, విషయ నిపుణులతో సంప్రదింపులు జరిపాక ప్రభుత్వం వాస్తవిక దృష్టితో చట్టాలు, కార్యక్రమాలను తెస్తుందన్నారు. ప్రభుత్వం తెచ్చిన చట్టాలు, విధానాలు, పథకాలు, కార్యక్రమాల అమలు చేయడం కలెక్టర్లకు ప్రాధాన్యత కావాలని ఆయన సూచించారు. కలెక్టర్లు ఎవరి ప్రాధాన్యాలు వారు ఎంచుకోవద్దు, అధికార యంత్రాంగం అంతటికీ ఒకే ప్రాధాన్యం ఉండాలని ఆయన సూచించారు. రాష్టస్థ్రాయి నుంచి కింది స్థాయి వరకు ఒకే ప్రాధాన్యతతో విధులు నిర్వర్తించాలన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం కొద్దికాలం చేసి మిన్నకుండే కార్యక్రమం కాదన్నారు. ఇది నిరంతరం కొనసాగాలన్నారు. దేశంలో ఆదర్శ పల్లెలు ఎక్కడున్నాయంటే తెలంగాణలో ఉన్నాయన్న పేరు రావాలని ఆయన అన్నారు. పల్లె ప్రగతి మాదిరిగానే త్వరలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. గ్రామాల్లో ఎవరు చేయాల్సిన పనిని వారితో చేయించాలి. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు వ్యవస్థతో పనిచేయించాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. గ్రామాల అభివృద్ధికి అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుందన్నారు. ప్రతీ నెలా రూ.339 కోట్లను పల్లెల అభివృద్ధికి విడుదల చేస్తున్నామని సీఎం వివరించారు. అలాగే జీహెచ్‌ఎంసీకి రూ.78 కోట్లు, ఇతర నగరాలకు రూ.70 కోట్ల చొప్పున విడుదల చేస్తామన్నారు. ఈ నిధులతో పట్టణాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ నగరం లోపల లక్షా 60 వేల ఎకరాల అటవీ భూమి ఉంది, వీటిలో దట్టమైన అడవులను పెంచాలి. వనస్థలిపురం హరిణ వనస్థలిని కేబీఆర్ పార్కు మాదిరిగా తీర్చిదిద్దాలని కేసీఆర్ ఆదేశించారు.
*చిత్రం...ప్రగతిభవన్‌లో మంగళవారం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్