తెలంగాణ

సివిల్ సర్వీస్ అధికారులకు దీర్ఘకాలిక వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రస్తుతం కలెక్టర్లుగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులే రాష్ట్రానికి రేపటి కార్యదర్శులు, శాఖాధిపతులని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడంతో పాటు సివిల్ సర్వీస్ అధికారులకు దీర్ఘకాలిక వ్యూహం ఉండాలన్నారు. ‘మంచి విధానాలు అమలవుతున్న ఇతర దేశాలకు వెళ్లి అధ్యయనం చేయాలి, ఉత్తమ పద్ధతులు, విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలి. కొత్తగా తెచ్చిన పంచాయతీరాజ్ చట్టం, మున్సిపల్ చట్టం ద్వారా గ్రామాలు, పట్టణాల పాలనలో కలెక్టర్ల బాధ్యతను ప్రభుత్వం పెంచింది’ అని ఆయన గుర్తు చేశారు. ప్రగతి భవన్‌లో మంగళవారం నిర్వహించిన కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల సమావేశంలో భోజన అనంతరం రెండో సెషన్‌లోనూ సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. కలెక్టర్ల వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా పరిపాలనను క్రమబద్ధం చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోందని సీఎం అన్నారు. కలెక్టర్లు ఇతర అధికారులతో సంప్రదింపులు జరపడానికి వీలుగా వైర్‌లెస్ సెట్లు సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న భూ రికార్డుల నిర్వహణను సరిదిద్దాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందన్నారు. రెవెన్యూ శాఖ
అజమాయిషీ కలెక్టర్ల చేతిలో ఉందన్నారు. భూ సంబంధ రికార్డులు పక్కగా ఉండాలన్నారు. కచ్చితంగా సంస్కరణలు రావాలని, 95 శాతం భూముల విషయంలో ఎలాంటి పేచీ లేదన్నారు. మిగతా వాటిని కూడా పరిష్కరించాలన్నారు. స్థానిక సంస్థల వ్యవహారాలు చూసే బాధ్యత అదనపు కలెక్టర్లదేనని, కంప్యూటర్లలో అన్ని గ్రామాలు, పట్టణాల చరిత్ర, సమగ్ర వివరాలు ఉండాలన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో విధిగా చేయాల్సిన ఖర్చులను అదనపు కలెక్టర్లు నిర్ధారించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అదనపు కలెక్టర్లకు రెండు రోజుల పాటు గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధిపై శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల నిధుల వినియోగానికి సంబంధించి ఎప్పటికప్పుడు యుటిలైజేషన్ సర్ట్ఫికెట్లు పంపించడాన్ని కలెక్టర్లు ప్రాధాన్యాంశంగా భావించాలని అన్నారు. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య ఉన్న భూ వివాదాలను పరిష్కరించాలని అన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరించాలని, ఈ అంశంపై స్వయంగా తానే జిల్లాల్లో పర్యటించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో వార్డులను యూనిట్‌గా తీసుకోవాలని, ప్రజాప్రతినిధులు, ప్రజా కమిటీ సభ్యులను భాగస్వామ్యం చేయాలని, అధికారులు, ప్రజాప్రతినిధులు పాదయాత్రలు చేసి వార్డుల వారీగా సమస్యలను గుర్తించాలని సీఎం కేసీఆర్ సూచించారు.

*చిత్రం..ప్రగతిభవన్‌లో మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు