తెలంగాణ

ట్రాక్టర్ల కొనుగోలు అదనపు భారమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: రాష్ట్రంలో గ్రామ పంచాయతీల్లో చెత్త తొలగించేందుకు, డంపుయార్డులకు తీసుకునిపోయేందుకు ట్రాలీ, ట్రాక్టర్, ట్యాంకర్, డోజర్ కొనాలని ఆదేశాలు జారీ చేశారని, అవసరం లేని చోట కొనుగోలు ఆపుచేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం పద్మనాభ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలకు ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.10లక్షలు చొప్పున దాదాపు రూ.1275 కోట్లు ఖర్చవుతుందన్నారు. కొన్ని గ్రామ పంచాయతీలు మినహా మిగిలిన వాటిల్లో ఈ ఖర్చు నిరర్థకమైనదన్నారు. ట్రాక్టర్ల అవసరం, కొనుగోలు వ్యవహారాలపై విచారణ జరిపి అవసరం లేని చోట కొనుగోలు ఆపుచేయాలన్నారు. చిన్నగ్రామాల్లో ప్రతి రోజూ ట్రాక్టర్ నిండేంత చెత్త జమ కాదు. హరితహారం కిందపెంచిన మొక్కలకు ప్రతి రోజూ నీరు అవసరం లేదన్నారు. వేసవిలో మూడు రోజులకోసారి నీరు ఇచ్చినా సరిపోతుందన్నారు. ట్రాక్టర్ అన్ని గ్రామాల్లో అవసరం లేదన్నారు. తాము నిర్మల్ జిల్లా పెంభి మండలంలోని పులగపందిరి గ్రామ పంచాయతీలో ఈ విషయమై సర్వే జరిపామన్నారు. చిన్న గ్రామ పంచాయతీలపై మోయలేని భారం పడుతుందన్నారు. ట్రాక్టర్లను కొనుగోలు బదులుగా చుట్టుపక్కల గ్రామాల్లో ట్రాక్టర్లు కిరాయిపై దొరుకుతాయన్నారు. ఈ విషయమై ప్రభుత్వం లోతుగా ఆలోచించి తాము చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.