తెలంగాణ

విద్య, ఆరోగ్యం, అధికార వికేంద్రీకరణతోనే ఓట్లు వస్తాయి: లోక్‌సత్తా నేత జేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: విద్య, ఆరోగ్యం, అధికార వికేంద్రీకరణలకు ఓట్లు వస్తాయని ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ రుజువు చేసిందని లోక్‌సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. దేశ రాజకీయాలను మార్చే ఒక మార్గంగా దీనిని చూడాలన్నారు. ఆప్ ఓడిపోయి ఉంటే నిజాయితీగా డబ్బు, మద్యం, పంచకుండా చేసే రాజకీయాలకు ఓట్లు పడవన్నారు. విద్య, ఆరోగ్యం, అంటే కులం, మతం వంటి వాటికే ఓట్లు పడతాయన్నారు. ఢిల్లీ పాఠాలు దేశమంతా మన ప్రజాస్వామ్యాన్ని మెరుగుపరచడానికి నాంది కావాలన్నారు. 2013, 2015లో సాధించిన విజయాల కంటే 2020లో ఆప్ సాధించిన విజయం గొప్పదన్నారు. భారత్‌లో విద్య, ఆరోగ్యాలకు ఎందుకు ఓట్లు రావు అని ప్రపంచంలో చాలలా మంది అడుగుతుంటారన్నారు. మేము విద్య, ఆరోగ్యం కోసం పనిచేశాం. ఓటివ్వండి అని దేశ చరిత్రలో మొదటిసారిగా ఒక పార్టీ ఎన్నికల్లో ఓట్లు అడిగి గెలిచిందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 56 శాతం ఓట్లు, ఆప్‌కు 15 శాతం ఓట్లు వచ్చాయన్నారు. కొన్ని నెలల వ్యవధిలో 50 శాతం ఓట్లతో మళ్లీ అధికారంలోకి వచ్చారన్నారు. ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో ఒక మాదిరిగా, అసెంబ్లీ ఎన్నికల్లో మరోలా ఓటింగ్ చేశారన్నారు. ప్రజాస్వామ్యంలో చైతన్యం పెరిగిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలన్నారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్, రామజన్మభూమి, షాహిన్‌బాగ్వంటివి ఎన్ని రకాలుగా రెచ్చగొట్టినా వాటన్నిటి కన్నా తమ రోజూ వారీ జీవితం, పిల్లల చదువుకు ప్రజలు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో రూ.1000 కోట్లు ఖర్చుపెట్టారని, స్థానికంగా అధికారాలను ఇవ్వకపోతే వౌలికంగా పెద్ద మార్పు రాదన్నరు. విద్య, ఆరోగ్యం మీద దృష్టి పెడితే దేశంలో కూడా మతం, కులం వంటి వాటికి అతీతంగా మంచి మార్పు సాధ్యమవుతుందన్నారు.