తెలంగాణ

కన్న తండ్రి మరణం -- దుఃఖాన్ని దిగమింగుకుని పరీక్ష రాసిన విద్యార్థిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమదేవరపల్లి, ఫిబ్రవరి 13: కన్న తండ్రి మరణించాడు అనే విషయం తెలిసినప్పటికీ ఆ బాధను గుండెల్లో దిగమింగి ఒక విద్యార్థిని గురువారం పరీక్షలు రాసింది. పరీక్ష హాల్ నుంచి బయటకు రాగానే కన్నీటి పర్యంతం కావడంతో విద్యార్థిని రోదన చూసి పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు కన్నీటి పర్యంతం అయ్యారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గురుకుల పాఠశాలలో గాయత్రి ఇంటర్మీడియేట్ బైపీసీ చదువుతోంది. ఆమె తండ్రి అబ్బోజు రమేష్ (45) పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో గురువారం ఉదయం మృతిచెందాడు. ఈ విషయం తెలిసి తల్లడిల్లిన ఆమెను కళాశాల ప్రిన్సిపల్ భార్గవి, చైర్మన్ రమేష్ దగ్గరుండి ధైర్యం చెప్పి జువాలజీ ప్రాక్టికల్ పరీక్ష రాయించారు. కాగా బైపీసీ ప్రథమ సంవత్సరంలో గాయత్రి 440 మార్కులకు 416 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచింది. తండ్రి వడ్రంగి వృత్తి చేస్తుండేవాడు. ఆయన మృతి వార్త తెలిసినప్పటికీ గుండె దిటవు చేసుకుని పరీక్ష రాసి బయటకు వచ్చిన గాయత్రి ‘మా నాన్న మృతి చెందాడు.. మా అమ్మను, మా తమ్ముడిని ఎవరు చూసుకుంటారు’ అని దీనంగా ఏడుస్తుండటంతో ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు.
*చిత్రం... పరీక్ష రాస్త్తున్న విద్యార్థిని గాయత్రి