తెలంగాణ

కరెంట్ షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ఇక తెలంగాణలో ఎన్నికలు కనుచూపు మేరలో లేనందున విద్యుత్ చార్జీలు పెంచుకోవడానికి వీలు కలుగుతుందని విద్యుత్ సంస్థలు భావిస్తున్నాయి. ప్రస్తుత తెలంగాణ అవసరాల కోసం విద్యుత్‌ను కొనుగోలు చేయక తప్పదని విద్యుత్ సంస్థల అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరో రెండేళ్లు 2020-2021 ఆర్థిక సంవత్సరానికి అవసరమైన విద్యుత్‌పై సమగ్ర నివేదికను డిస్కంలు ఇవ్వాలి. సబ్సిడీలతో పాటు వాణిజ్య రంగాలకు ఇస్తున్న విద్యుత్‌ను పరిగణనలోకి తీసుకోనున్నారు. వచ్చే రెండేళ్లల్లో ఏ మేరకు విద్యుత్ అవసరమో వాటికి సంబంధించిన ప్రణాళికలను ఈఆర్‌సీకి నివేదించాల్సి ఉంది. వీటిని పరిశీలించిన అనంతరం ఈఆర్‌సీ విద్యుత్ చార్జీల పెంపునకు సంకేతాలు ఇవ్వవచ్చునని తెలుస్తోంది. తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ మండలికి ఈనెల 29 నాటికి విద్యుత్ సంస్థలు (డిస్కంలు) తమ నివేదికను అందించనున్నాయి. అనుకున్నట్లుగా డిస్కంలు (విద్యుత్ సంస్థలు) 29వ తేదీన నివేదిక అందజేస్తే రానున్న మార్చి నుంచి విద్యుత్ చార్జీలు
పెంచడానికి ఈఆర్‌సీ ఆమోదం చెప్పవచ్చు. ఇటీవల విద్యుత్ అడ్వయిజరీ కమిటీలో సంబంధిత ఉద్యోగులు విద్యుత్ చార్జీలు పెంచాల్సిందేనని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చార్జీలు పెంచకపోతే డిస్కంలు మనుగడ సాధించలేవని చెబుతున్నారు. మరోపక్క రాష్ట్రంలో నానాటికీ విద్యుత్ అవసరాలు పెరుగుతున్న అంశాలను ప్రభుత్వానికి డిస్కం అధికారులు గుర్తు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తోంది. ఇక మరో నాలుగేళ్ల వరకూ సాధారణ ఎన్నికలు జరిగే సూచనలు లేవంటున్నారు. ప్రజల నుంచి నిరసనలు ఎదురుకాకుండా చార్జీలను పెంచడానికి టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని చూస్తున్నారు. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తే విద్యుత్ చార్జీలు మార్చి నుంచి పెరగనున్నాయి. విద్యుత్ ఉత్పత్తి థర్మల్ కేంద్రాలు పూర్తిచేయడానికి వ్యవధి కావాలని విద్యుత్ సంస్థల అధికారులు చెబుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కాళేశ్వరం భారీ ప్రాజెక్టు సాగు, తాగునీటిని అందించేందుకు అవసరమైన విద్యుత్‌ను సరఫరా చేయడానకి ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికే ఎన్‌టీపీసీ నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి సీఎం ఆమోదం తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల ఎన్‌టీపీసీ ఉన్నతాధికారులతో గోవాలో తెలంగాణ విద్యుత్ సంస్థల అధికారుల చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ గోపాల్‌రావు చర్చలు పాల్గొన్నారు. ఏపీ ఇప్పటికే విద్యుత్ చార్జీలను పెంచింది. జీరో నుంచి 499 యూనిట్ల వరకూ ఎలాంటి చార్జీలను పెంచడం లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. 500 యూనిట్ల పైబడి వరకు విద్యుత్‌ను వినియోగిస్తే యూనిట్‌పై 0.95 పైసలు పెరుగుతుందని ఏపీఈఆర్‌సీ స్పష్టం చేసింది. వ్యవసాయ రంగానికి ఇస్తున్న సబ్సిడీని ఏపీ ప్రభుత్వం భారీగా పెంచింది. వాణిజ్య రంగాలకు మాత్రం స్వల్పంగా పెంచింది.