తెలంగాణ

సహ కారు జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సత్తా చాటింది. పార్టీ రహితంగా ఎన్నికలు జరిగినా, మొత్తం మీద అత్యధిక స్థానాల్లో టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయబావుటా ఎగురవేశారు. దీంతో టీఆర్‌ఎస్ పార్టీ అధినాయకత్వం, పార్టీ నేతలు, శ్రేణుల్లో కదనోత్సాహం కనపడింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పార్టీ కార్యకర్తల్లో జోష్ పెరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్ హవా కొనసాగిన విషయం విదితమే. రాష్ట్రంలో మొత్తం 906 సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో 904 సహకార సంఘాలకు సహకార శాఖ ఎన్నికలు నిర్వహించింది. తొలుత 157 సహకార సంఘాలు, వాటి పరిధిలోని 2,017 వార్డులకు ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. మిగిలిన 747 సహకార సంఘాల్లో కూడా 3,388 వార్డుల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. మిగిలిన 6,248 వార్డులకు శనివారం ఎన్నిక జరిగింది. వీటి కోసం 14,530 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. 9,11,599 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 6,248 వార్డులకు ఎన్నికల ప్రక్రియ ముగిసింది. దీంతో రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఎన్నిక ముగిసినట్లు సహకార శాఖ ప్రకటించింది. కాగా, ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో ఉన్న సహకార సంఘాల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఆధిపత్యం కొట్టొచ్చినట్లు కనపడింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలన్నీ అధికార పార్టీ వశమయ్యాయి. పార్టీలకు అతీతంగా ఎన్నికలు నిర్వహించినా, గులాబీ పార్టీ మద్దతుదారులే 90 శాతానికి పైగా ఆయన టీసీల నుంచి డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. దీంతో సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు కైవశం చేసుకోనున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవడంతో సభ్యులు బాణసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్ జైత్రయాత్ర కొనసాగింది. 96 సంఘాల పరిధిలో 853 వార్డులకు శనివారం పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. టీఆర్‌ఎస్ పార్టీ మెజారిటీ డైరెక్టర్లను గెలుచుకుంది. అంతకుముందు 109 సంఘాల్లో ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల్లో అధికార పార్టీ మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. టీఆర్‌ఎస్ మద్దతుదారులు 70 సంఘాలు, కాంగ్రెస్ మూడు, బీజేపీ ఒక స్థానాన్ని గెలుచుకున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని ధరూర్ సింగిల్ విండోలో బీజేపీ, కలుగట్ల, వడ్డేపల్లి, సింగిల్‌విండోలో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. నాగర్‌కర్నూలు పరిధి జిల్లాలోని ఆమ్రాబాద్‌లో సైతం కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్‌ఎస్ జోరు కొనసాగింది. 98 సహకార సంఘాల ఎన్నికల్లో అన్ని సొసైటీ సంఘాల్లో అధికార టీఆర్‌ఎస్ హవా కొనసాగింది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కంచనపల్లి, నిడిగొండ రెండు సొసైటీల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. వరంగల్ రూరల్ జిల్లాలో ఆత్మకూరులో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. మహబూబాబాద్‌లో టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులే సంపూర్ణ ఆధిక్యతను ప్రదర్శించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 77 సహకార సంఘాలకు 22 ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. మిగిలినచోట్ల టీఆర్‌ఎస్ ఆధిక్యత కొనసాగింది. ఇదిలావుండగా, ఆదివారం చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికను నిర్వహించనున్నారు. ఖమ్మం,