తెలంగాణ

మే 2న ఈసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలో బీఎస్సీ డిగ్రీ లేదా పాలిటెక్నిక్ కోర్సులు పూర్తిచేసిన వారు నేరుగా ఇంజనీరింగ్‌లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఈసెట్-2020 షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి శనివారం రాత్రి విడుదల చేశారు. మే 2వ తేదీన రెండు సెషన్స్‌లో ఆన్‌లైన్‌లో ఈసెట్ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఆరోసారి ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతను జేఎన్‌టీయూకు అప్పగించినట్టు ఆయన చెప్పారు. ఈనెల 24 నుండి మార్చి 26వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామని, ఏప్రిల్ 9 నుండి 12వ తేదీ వరకూ దరఖాస్తుల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే సవరించుకునే వీలుంటుందని, ఏప్రిల్ 20 నుండి 27వ తేదీ వరకూ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు. మే 2వ తేదీన ఉదయం 10 నుండి ఒంటి గంట వరకూ ఈసీఈ, ఈఐఈ, సీఎస్‌ఈ, ట్రిపుల్‌ఈ గ్రూపులకు, మధ్యాహ్నం 3 గంటల నుండి ఆరు గంటల వరకూ సివిల్, కెమికల్, మెకానికల్, మైనింగ్, మెటలర్జీ, ఫార్మసీ తదితర గ్రూపులకు ప్రవేశపరీక్ష ఉంటుందని ఆయన అన్నారు. పరీక్ష దరఖాస్తు ఆన్‌లైన్‌లోనే సమర్పించాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలు 400 రూపాయిలు, ఇతరులు 800 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తుల సమర్పణకు ఆలస్యమైతే ఏప్రిల్ 8 నుండి 500 రూపాయిలు, ఏప్రిల్ 18 నుండి వెయ్యి రూపాయిలు, ఏప్రిల్ 25 నుండి ఐదు వేల రూపాయిలు, ఏప్రిల్ 28 నుండి పది వేల రూపాయిలు జరిమా నా చెల్లించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజును టీఎస్ ఆన్‌లైన్ సెంటర్లలో లేదా ఏపీ ఆన్‌లైన్ సెంటర్లలో చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈసెట్ పరీక్ష నిర్వహణకు 18 రీజనల్ సెంటర్లు ఏర్పాటు చేశామని, తెలంగాణలో 14, ఆంధ్రాలో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. కేవలం హైదరాబాద్‌లోనే నాలుగు రీజనల్ సెంటర్లు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వీ వెంకటరమణతో పాటు కన్వీనర్ డాక్టర్ ఎ మన్జూర్ హుస్సేన్, ఎమ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఏ గోవర్దన్ పాల్గొన్నారు.