తెలంగాణ

ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లను కాపాడుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభత్వం ప్రవేశపెట్టిన ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ల విధానం ఆంధ్ర. తెలంగాణ రాష్ట్రాల్లో కొనసాగుతోందని,
ఈ రిజర్వేషన్లను కాపాడుకునేందుకు సుప్రీం కోర్టులో బలమైన న్యాయ పోరాటం చేస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. శనివారం ఇక్కడ ఆయన ప్రకాశం హాల్‌లో సీనియర్ కాంగ్రెస్ నేత మహ్మద్ అలీ షబ్బీర్ ముస్లింలకు రిజర్వేషన్లు అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఈ రిజర్వేషన్లు పేద ముస్లింల సామాజిక ఆర్థిక విద్య, రాజకీయ సాధికారతకు దారితీసిందన్నారు. 12 శాతం రిజర్వేషన్ల హామీ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింలను మోసం చేశారన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో 12 శాతం ముస్లిం కోటాను అమలు చేస్తామన్నారు. కేసీఆర్ దీని గురించి కూడా మాట్లాడడం లేదన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ బీజేపీ మిత్రపక్షమన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లను అమలు చేసినట్లు చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాల ద్వారా లబ్ధి పొందారన్నారు. తెలంగాణ విద్యార్థులందరిలో ముస్లిం శాతం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందన్నారు. ఈ రిజర్వేషన్ల వల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింల వాటా గణనీయంగా పెరిగిందన్నారు. బీసీ ఈ కింద పేద, వెనుకబడిన ముస్లింలు కూడా వెనుకబడిన తరగతులకు కేటాయించిన అన్ని స్థానాల నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులన్నారు. ఈ నెలలో నాలుగు శాతం కోటా కేసుపై సుప్రీం కోర్టులో తిరిగి విచారణ ప్రారంభమైందన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లకు అనుకూలంగా న్యాయ పోరాటంలో విజయం సాధించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి జాఫర్ జావీద్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నగర అనిల్‌కుమార్ యాదవ్, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలుగు శాతం ముస్లింలకు రిజర్వేషన్ల కోసం పోరాటంపై డాక్యుమెంటరీని కూడా ప్రదర్శించారు.

*చిత్రం... హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ముస్లిం రిజర్వేషన్లపై శనివారం జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి