తెలంగాణ

అది అధికార పార్టీ ఫంక్షనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ‘మెట్రో రైలు ప్రారంభోత్సవం అంటే టీఆర్‌ఎస్ పార్టీలో ఫంక్షనా? వాళ్లిష్టం వచ్చినట్టు చేసుకోవడానికి. అధికారులై మీరేం చేస్తున్నారు? చెప్పనక్కర్లేదా’ అంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి మెట్రో రైలు ప్రాజెక్టు అధికారులకు క్లాసు తీసుకున్నారు. ఇటీవల జేబీఎస్ నుండి సీబీఎస్ రూటు మెట్రో రైలు ప్రారంభోత్సవానికి స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరికీ ఆహ్వానం లేదని, కేంద్రం నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కార్యక్రమాల్లో హోర్డింగ్‌ల్లో కనీసం ప్రధాని ఫొటో కూడా వేయలేదని, అధికారులు సైతం వివక్షా పూరితంగా వ్యవహరించడం దారుణమని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
ప్రొటోకాల్ పాటించరా?
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలు ప్రారంభోత్సవానికి తనను పిలవలేదంటూ మెట్రో అధికారులపై కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ పాటించరా? అంటూ అధికారుల తీరును తూర్పారబట్టారు. రాజకీయ దురుద్దేశ్యంతోనే తనకు ఆహ్వానం పంపలేదని
ఆయన అసహనం వ్యక్తం చేశారు. మెట్రో రైలు ప్రారంభోత్సవం అంటే టీఆర్‌ఎస్ ఫంక్షనా అని ప్రశ్నించారు.
మెట్రో రైలులో ప్రయాణం
అనంతరం కేంద్ర మంత్రి జేబీఎస్ నుండి సీబీఎస్ వరకూ మెట్రో రైలులో ప్రయాణించారు. కిషన్‌రెడ్డి వెంట బీజేపీ నేతలు డాక్టర్ కే లక్ష్మణ్, మోత్కుపల్లి నరసింహులు, చింతల రామచంద్రారెడ్డి, మెట్రో అధికారులు ఉన్నారు.
బిజీబిజీగా..
శనివారం నాడు నగరంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి బిజీబిజీగా గడిపేస్తూ, అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దిల్‌కుషా అతిథి గృహంలో మెట్రో రైలు కార్యక్రమాలను సమీక్షించిన కిషన్ రెడ్డి అనంతరం మెట్రో రైలులో ప్రయాణం చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. అంతకుముందు ఆయన బోలక్‌పూర్ కమ్యూనిటీ హాలుకు శంకుస్థాపన చేశారు. వాలీబాల్ టోర్నమెంటును ప్రారంభించారు. శనివారం రాత్రి కిషన్‌రెడ్డి ఇక్కడి పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో శంకరనారాయణ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఎన్ని ఇళ్లు కట్టారో చెప్పండి
మజ్లిస్ చేతిలో టీఆర్‌ఎస్ పార్టీ కీలుబొమ్మగా మారి పాతబస్తీకి మెట్రో రైలు రాకుండా చేసిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నగరంలో పాతబస్తీ చాలా వెనుకబడి ఉందని, పాతబస్తీ అభివృద్ధిని కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. మెట్రో రావడం వల్ల పాతబస్తీ రూపురేఖలే మారిపోతాయని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతులతో నే హైదరాబాద్‌కు మెట్రో రైలు నిర్మాణం పూర్తయిందని, మెట్రోకు కేంద్రం 1,200 కోట్ల రూపాయిల నిధులు ఇచ్చిందని, మరో 250 కోట్ల రూపాయిలు ఇవ్వాల్సి ఉందని అన్నారు. ఫలక్‌నుమా వరకూ మెట్రో నిర్మాణం చేస్తామంటేనే కేంద్రం నిధులు ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. మెట్రో రైలు టికెట్ ధరలు అధికంగా ఉన్నాయని, దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
కేంద్రాన్ని విమర్శించడమే పనా?
కేంద్రంపై విమర్శలు చేయడమే పనిగా కేటీఆర్ పెట్టుకున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రం నిధులు ఇస్తున్నా, అసలు ఎన్ని ఇళ్లు కట్టారో చెప్పాలని ఆయన నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇళ్లు నిర్మించినా, అందుకు తగ్గట్టు నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఎంఎంటీఎస్ రెండో దశ పనులు ప్రారంభం కావడం లేదని ఆయన విమర్శించారు. ఇప్పటికే యాదగిరిగుట్ట వరకూ ఎంఎంటీఎస్ కోసం కేంద్రం తన వాటాకు మించి అదనపునిధులు ఇచ్చిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వమే సహకరించడం లేదని చెప్పారు.

*చిత్రం... మెట్రో రైలులో బీజేపీ నాయకులతో కలసి ప్రయాణిస్తున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి