తెలంగాణ

సొసైటీల్లో టీఆర్‌ఎస్ పాగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 15: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో ప్రాథమిక సహకార సంఘాలకు శనివారం జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అత్యధిక స్థానాలను గెలుచుకున్నది. ఖమ్మం జిల్లా పరిధిలోని 76 సంఘాలకు 34 టీఆర్‌ఎస్‌కు ఏకగ్రీవం కాగా, కొత్తగూడెం జిల్లా పరిధిలోని 21 సంఘాలకు 2 టీఆర్‌ఎస్‌కు ఏకగ్రీవం అయ్యాయి. ఖమ్మం జిల్లాలో ఎన్నికలు జరిగిన 42స్థానాల్లో 28చోట్ల టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా 7చోట్ల కాంగ్రెస్, 5చోట్ల సిపిఎం, ఒకచోట సిపిఐ, ఒకచోట స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఖమ్మం, వైరా, పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో అన్ని స్థానాలను టిఆర్‌ఎస్ కైవసం చేసుకున్నది. కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గ పరిధిలో 24సంఘాలు ఉండగా 15చోట్ల టిఆర్‌ఎస్ విజయం సాధించగా 5చోట్ల కాంగ్రెస్, 4చోట్ల సిపిఎం అభ్యర్థులు గెలుపొందారు. మరోవైపు సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని 24సంఘాలకు గాను 23చోట్ల టిఆర్‌ఎస్ విజయం సాధించింది. కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉన్న ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలో సీపీఎం 4చోట్ల విజయం సాధించడం విశేషం. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పథవులకు నోటిపికేషన్ వెలువడనున్న నేపధ్యంలో టీఆర్‌ఎస్ అధిష్ఠానం సూచించిన వ్యక్తులే ఆ స్థానాలను గెలుచుకోనున్నారు.