తెలంగాణ

పల్లె ప్రగతిలో ప్రజలను భాగస్వామ్యం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: పల్లెల ప్రగతిలో ప్రజలను భాగస్వాములను చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిప్రజాప్రతినిధులను కోరారు. ఈ నెల 20వ తేదీ వనపర్తి, 21వ తేదీన జోగుళాంబ గద్వాల, 23వ తేదీన నాగర్ కర్నూలు జిల్లాల్లో పంచాయతీ సమ్మేళనాలకు ఇన్‌చార్జీగా మంత్రిగా హాజరవుతున్నుటల్చెప్పారు. గాంధీజీ కలలుకన్న గ్రామ వికాసం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తపిస్తునానరన్నారు. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అన్నది ఇప్పటి వరకు నినాదంగానే మిగిలిపోయిందన్నారు. దీనిని కేసీఆర్ నిజం చేస్తున్నార్నారు.
గ్రామాల అభ్యున్నతి కోసం పటిష్టమైన ప్రణళికతో ప్రభుత్వం ఒక్క మనిషికి ఏడాదికి రూ..1655 కేటాయిస్తుందన్నారు. గ్రామాల్లో కనీస వసతుల కల్పన, పరిసరాల పరిశుభ్రత, రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణానికి వాడుకోవాలన్నారు. మొక్కల పెంపకం ఉద్యమంలా సాగాలన్నారు. క్షేత్రస్థాయి ఇబ్బందులను సమగ్రంగా పరిశీలించిన ప్రభుత్వం పల్లె ప్రగతికి శ్రీకారం చుట్టిందన్నారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ రాష్టమ్రే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవోలు, ఎంపీడీవోలు, గ్రామాభివృద్ధిశాఖ ఉద్యోగులు తప్పనిసరిగా హాజరయ్యేలా ఏర్పాటు చేయాలని ఆయన జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
ఆస్ట్రేలియాలో కేసీఆర్ హరిత జన్మదిన వేడుకలు
కేసీఆర్ జన్మదిన వేడుకలను ఆస్ట్రేలియాలోని సిడ్నీ, ఆడిలైడ్, మెల్బోర్న్, కానె్బర్రా, బ్రిస్బేన్, గోల్డ్ కోస్‌ట, బెండిగో, బల్లార్ట్ నగరాల్లో నిర్వహించినట్లు టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి చెప్పరు. రాజేష్ రాపోలు ఆధ్వర్యంలో సిడ్నీల కేసీఆర్ దీర్ఘయుష్యుకై ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ నాడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపి, ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడి చావు అంచులకు వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని నేడు ప్రగతి రథంలో నడిపిస్తున్న కేసీఆర్ దీర్గాయుష్యుతో, ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కోరారు. ఈ వేడుకల్లో రవీందర్ చింతామణి, రవి శంకర్ దూపాటి, లక్ష్మణ్ నల్సా, పరుశురామ్, మతుకుల, సంగీత ధూపాటి తదితరులు పాల్గొన్నారు.

పశుసంవర్థక కార్యాలయాల్లో
కేసీఆర్ జన్మదిన వేడుకలకు ఏర్పాట్లు: తలసాని
ఈనెల 17వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని అన్ని పశువైద్య శాలలు, మత్స్య శాఖ కార్యాలయాలు, డెయిరీ కార్యాలయాలు, వెటర్నరీ యూనివర్శిటీల ఆవరణలో పెద్ద ఎత్తున మొక్కలను నాటనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు, భావితరాలకు స్వచ్ఛమైన ఆరోగ్న్నా అందించేందుకు మొక్కల పెంపకం ఎంతో దోహదపడుతుందన్నారు. విరివిగా మొక్కలను నాటడం వల్ల కాలుష్యాన్ని నిరోధించవచ్చన్నారు. సీఎం కేసీఆర్ ఫ్రత్యేక ఆలోచన, ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా హరిత హారం వల్ల సత్ఫలితాలు వస్తున్నాయన్నారు.