తెలంగాణ

గిరిజనుల సంస్కృతిని పరిరక్షించిన మహానేత కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: తెలంగాణలో గిరిజనుల సంస్కృతిని పరిరక్షించిన మహానేత కేసీఆర్ అని, గిరిజనుల సంక్షేమం కోసం ఇతోధికంగా నిధులు కేటాయించి అభివృద్ధికి పాటుపడుతున్నారని గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం ఇక్కడ ఆమె శ్రీసంత్ సేవాలాల్ మహరాజ్ 281వ జయంతి సందర్భంగా రాజేంద్రనగర్, ఐఎఎస్ స్టడీ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన భోగ్ భండార్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ సేవాలాల్ పండుగ కోసం కోటి రూపాయలు కేటాయించి నోగ్ భండార్ నిర్వహించుకునే అవకాశం ఇచ్చారన్నారు. తాను తక్కువ చదువుకున్నా, సేవాలాల్ మహారాజ్ దీవెనలతో సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో ఈ శాఖకు మంత్రిగా పని చేస్తూ గిరిజనులకు సేవ చేసే అవకాశం లభించినట్లు చెప్పారు. తాను ప్రస్తుతం మంత్రిని అయినా ముందుగా గిరిజన బిడ్డనని, ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోనన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేనన్నీ గురుకులాలను పెట్టరన్నారు. ఉన్నత ఉద్యోగాలు పొందాలన్నారు. బంజారాహిల్స్‌లో మనకు స్థానం లేకుండా అభివృద్ధి అయితే, ఇప్పుడు రూ.100 కోట్ల విలువైన భూమిని కేటాయించి బంజారా భవన్‌ను నిర్మించి ఆత్మగౌరవాన్ని నిలుపుతున్నారన్నారు. కొమురం భీమ్‌భవన్‌ను కూడా నిర్మించి రాష్ట్రంలో అందరూ ఆత్మగౌరవంగా ఉండే విధంగా కృషి చేస్తున్నార్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, సమాచార కమిషనర్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.