తెలంగాణ

17 నుంచి బయో ఏషియా సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మూడు రోజుల పాటు బయో ఏషియా సదస్సును నిర్వహించేందుకు ఏర్పాట్లు చకాచకా సాగుతున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది బయో ఏషియా సదస్సు సందర్భంగా లైఫ్ సైనె్సస్ విభాగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా జీవ శాస్త్ర పరిశోధకులు, పాలసీ మేకర్లు, ఇన్నోవేటర్లు, పెట్టుబడీదారులు పాల్గొంటారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ బయో ఏషియా సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది పరిశోధకులు, పెట్టుబడీదారులు ఆసక్తిని కనపరుస్తున్నరన్నారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్, శాస్తవ్రేత్తలు డాక్టర్ కార్ల్ జూన్, డాక్టర్ పీటర్ పియట్, డాక్టర్ వ్యాస్ నరసింహన్,, డాక్టర్ జాన్ వాన్ ఆకర్, దిలీప్ సింఘ్వీ, అజయ్ పిరమాల్, కిరణ్ మజుందార్ షా పాల్గొంటారు. ఫార్మా పరిశ్రమ, వైద్య పరికరాలు, డిజిటల్ హెల్త్ తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు.