తెలంగాణ

గాంధీతోపాటు నెహ్రూ విగ్రహాన్నీ ఏర్పాటు చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: తాను రాజకీయాలపై మూడు నెలల పాటు వౌనంగా ఉంటానని చెప్పానంటే ప్రత్యర్థి పార్టీల గురించి మాట్లాడకపోవడమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. పీసీసీ రేసులో తాను ఉన్నట్లు చెప్పడమంటే ఇంటి సమస్యలపై వౌనంగా ఎలా ఉంటానని అన్నారు. శనివారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించాల్సిన అవసరం లేదన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కొనసాగించాలని కోరుతున్నట్లు ఆయన చెప్పారు. మార్పు తప్పదనుకుంటే తనకు ఆవకాశం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసకు వచ్చే వైద్యం తన వద్ద ఉందన్నారు. పీసీసీ అధ్యక్షుడు అంటే ఇంటి పెద్ద లాంటి వారని, ఎవరూ వ్యతిరేకించరన్నారు. సంగారెడ్డిలో గాంధీ విగ్రహంతో పాటు నెహ్రూ విగ్రహం కూడా పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 60 అడగుల నెహ్రూ విగ్రహాన్ని సంగారెడ్డిలో ఏర్పాటు చేస్తామన్నారు. జీవితం అంతా పోరాటాల్లోనే గడిపిన నేత నెహ్రూ అన్నారు. గాంధీ విగ్రహంతో పాటు నెహ్రూ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.