తెలంగాణ

మంత్రి తలసానికి రూ. 5 వేల జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: మహానగరంలో ఎక్కడబడితే అక్కడ అక్రమంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టరాదంటూ, డీఫేస్‌మెంట్ యాక్టును ఉల్లంఘించి నగరాన్ని కళావిహీనంగా మార్చోద్దంటూ మున్సిపల్ మంత్రి కేసీఆర్ ఎన్ని సార్లు హితవు పలికినా, అధికారపార్టీకి చెందిన అమాత్యుల్లో ఏ మాత్రం మార్పు రావటం లేదు. మంత్రి కేటీఆరే రెండు సార్లు పలువురు కార్పొరేటర్లకు జరిమానాలు విధించిన సంగతి తెలిసిందే! ఈ సారి జరిమానా చెల్లించాల్సి వంతు మంత్రి తలసానికి దక్కింది. రాష్ట్ర పశుసంవర్థక , సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌కు జీహెచ్‌ఎంసీ షాక్ ఇచ్చింది. ఈ నెలర 17వ తేదీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి తలసాని నగరంలోని సికిందరాబాద్ తదితర ప్రాంతాల్లో ‘వీ లవ్ కేసీఆర్’ అన్న నినాదాలతో భారీ కటౌట్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే, వీటిని ఏర్పాటు చేశారని పేర్కొంటూ జీహెచ్‌ఎంసీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్(ఈవీడీఎం)లో సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ శనివారం మధ్యాహ్నాం నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత జీహెచ్‌ఎంసీ అధికారులను సంప్రదించిన మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఐదువేల రూపాయల జరిమానా చెల్లించినట్లు తెలిసింది. నగరంలో ఎక్కడబడితే అక్కడ చెత్తాచెదారం, భవన నిర్మాణ వ్యర్థాలను వేయటం, ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేస్తున్న సంస్థలపై ఈవీడీఎం ఇష్టారాజ్యంగా జరిమానాలు విధిస్తోందంటూ ఈ నెల 8వ తేదీన జరిగిన కౌన్సిల్ సమావేశంలో అధికార, విపక్షాలకు చెందిన సభ్యులంతా ఆరోపించిన సంగతి తెలిసిందే! కేవలం మధ్య తరగతి ప్రజలను, చిరువ్యాపారులను టార్గెట్ చేసుకుని జరిమానాలు విధిస్తున్నారని ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో నిబంధనలను ఉల్లంఘించే వారెంతటి వారైనా ఉపేక్షించేది లేదంటూ ఈవీడీఎం ఏకంగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌కు జరిమానా విధించి నిరూపించుకుంది.