తెలంగాణ

సమన్వయంతోనే సమస్యల పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని బల్దియా కమిషనర్ లోకేశ్‌కుమార్ అన్నారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో శనివారం వివిధ ప్రభుత్వ శాఖల విభాగాధిపతులతో కన్వర్జెన్సీ సమావేశాన్ని నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అరికట్టేందుకు ఏఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందో గుర్తించి, ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలను చేపట్టాలని సమావేశం నిర్ణయించింది. పోలీసు శాఖాధికారులుమాట్లాడుతూ జీహెచ్‌ఎంసీలో ట్రాఫిక్, రోడ్డు సేఫ్టీకు సంబంధించి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికపుడు పర్యవేక్షించాలని అన్నారు. చాలా వరకు జరిగే డెత్ కేసుల్లో దాదాపు 31శాతం మరణాలు యాక్సిడెంట్స్ మూలంగా జరుగుతున్నాయని అన్నిరు. రోడ్లపై ప్రయాణించేటపుడు లిమిట్ స్పీడ్‌ను నిర్దేశిస్తే ఇలాంటి ప్రమాదాలను అరికట్టే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు బ్లాక్ స్పాట్స్‌లను గుర్తించి రోడ్లను రీ ఇంజనీరింగ్ చేయాలన్నారు. జలమండలి అధికారులు వాటర్ ట్యాంకర్లకు జరిమానా వసూలు చేస్తున్నారని తెలపగా, పోలీసు శాఖాధికారులు ఇటువంటి కేసులేమైనా ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే, చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్డు కట్టింగ్ విషయాన్ని ప్రస్తావిస్తూ రోడ్డు త్వకవ ముందే యుటిలిటీ మ్యాపింగ్ తీసుకుని, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. పెండింగ్‌లో ఉన్న పనులకు సంబంధించి నిధుల లేమి లేని చోట పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వాటర్ లాగింగ్ సమస్యను వెంటనే పరిష్కరిస్తే ట్రాఫిక్ సమస్య కూడా తగ్గుముఖం పడుతుందని అభిప్రాయపడ్డారు. భూసేకరణకు సంబంధించిన అంశాల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు, రెవెన్యూ సిబ్బంది పరస్పరం సహకరించుకుని సమస్యలను పరిష్కరించాలని సూచించారు. వివిధ ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు తరలించే ప్రక్రియ జాప్యం లేకుండా పూర్తి చేయాలని అన్నారు. మెయింటనెన్స్‌లో భాగంగా చెట్లను కొట్టేసేటపుడు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ట్రిమ్మింగ్ చేయాలని సూచించారు. కమిషనర్ పెండింగ్ బిల్లును ప్రస్తావిస్తూ బిల్లుల ఆమోదానికై ప్రతిపాదనలు తయారు చేసి ఇవ్వాలని, ఆయా శాఖాధికారులను ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో ‘కూడా’అధికారులు కొన్ని ప్రపాంతాల్లో ఏర్పాటు చేస్తున్న సీవర్‌లైన్స్ శాస్ర్తియంగా లేవని, వీటిని ఏర్పాటు చేసేటపుడు జలమండలి అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.