తెలంగాణ

‘ఉయ్ లవ్ కేసీఆర్’ లోగో ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌లో ఉయ్ లవ్ ఫర్ కేసీఆర్ లోగోను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన జలవిహార్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. బల్కంపేట ఎల్లమ్మ గుడి దగ్గర మొక్కలు నాటే కార్యక్రమాన్ని వినూత్న పంథాలో చేపట్టనున్నట్లు చెప్పరు. జలవిహార్‌లో హరితహారం, హెల్త్ క్యాంప్, ఫోటో ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నారు. స్టేజిపైన కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుందన్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత రెడ్డి మాట్లాడుతూ ఆకుపచ్చని తెలంగాణ, పర్యావరణ హిత రాష్ట్రం కోసం కేసీఆర్ పరితపిస్తున్నారన్నారు. స్వప్నాన్ని నిజం చేసేందుకు పునరంకితం కావాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మొక్కల సంరక్షణపై విస్తృత అవగాహన కల్పిస్తామన్నారు.

*చిత్రం...నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌లో ఉయ్ లవ్ ఫర్ కేసీఆర్ లోగోను ఆవిష్కరించిన అనంతరం అక్కడకు వచ్చిన పాఠశాలల విద్యార్థినులతో ముచ్చటిస్తున్న మంత్రి తలసాని