తెలంగాణ

బోర్డు తిప్పేసిన అకాడమీ సంస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: హైదరాబాద్‌లో ఓ అకాడమీ సంస్థ బోర్డు తిప్పేసింది. నగరంలోని కర్మన్‌ఘాట్‌లో ఉన్న నాగార్జున అకాడమీ సంస్థ నిర్వాహకులు శుక్రవారం కనిపించకుండా పోయారు. ఆయా పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను తప్పకుండా పాస్ చేస్తామంటూ ఒక్కో విద్యార్థి నుంచి అకాడమీ నిర్వాహకులు రూ. 30 వేల నుంచి రూ. 40 వేల చొప్పున వసూలు చేశారు. అయితే..శుక్రవారం ఉదయం నుంచి అకాడమీకి సంబంధించిన వ్యక్తులెవరూ కనిపించకపోవడంతో బాధిత విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది రూపాయలు దండుకున్న అకాడమీ నిర్వాహకులు బోర్డు తిప్పేసి తమను మోసం చేశారంటూ నిరసిస్తూ, అకాడమీ ఎదుట ధర్నాకు దిగారు. కాగా నిర్వాహకుల నుంచి సాయంత్రం వరకూ ఎలాంటి సమాచారం అందకపోవడంతో విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అయితే నాగార్జున అకాడమీపై తమకు లిఖిత పూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు.
కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వాయిదా
ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అస్వస్థత
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జులై 22: నీటి పారుదల ప్రాజెక్టులపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇవ్వాలనుకున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వాయిదా పడింది. టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అస్వస్థతకు గురి కావడం వల్ల శనివారం (23న) నిర్వహించాలనుకున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను తాత్కాలికంగా వాయిదా వేశామని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి శుక్రవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. అంతేకాకుండా ఈ నెల 25న పెద్దపల్లిలో నిర్వహించాలనుకున్న పార్టీ కార్యకర్తల సమావేశాన్ని వాయిదా వేసినట్లు ఆయన చెప్పారు. అదేవిధంగా 28న మహబూబ్‌నగర్‌లో నిర్వహించాలనుకున్న టి.పిసిసి కార్యవర్గ సమావేశం, 30న ఆదిలాబాద్‌లో నిర్వహించాలనుకున్న టి.పిసిసి సమన్వయ కమిటీ సమావేశం, రైతు గర్జన బహిరంగ సభలను కూడా వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. కాంట్రాక్టర్లకు లబ్ది చేకూరేలా ప్రాజెక్టుల రీ-డిజైన్లను పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 90 శాతం వరకు పూర్తయిన ప్రాజెక్టులను పూర్తి చేసి పంట పొలాలకు నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని మల్లు రవి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టి.పిసిసి ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ పాల్గొన్నారు.
సింగరేణిలో
ఎన్నికల హడావుడి
కొత్తగూడెం, జూలై 22: సింగరేణిలో గుర్తింపు ఎన్నికల సందడి మొదలయింది. ఒకనాటి ప్రత్యర్థి సంఘాలు ఎఐటియుసి, ఐఎన్‌టియుసిలు ఈ ఎన్నికల్లో ఐక్యం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గుర్తింపు సంఘం కాలపరిమితి పూర్తవడంతో ఇప్పటి నుండి ప్రత్యర్థి సంఘాలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. ఇప్పటికే ఐన్‌టియుసికి అనుబంధంగా ఉన్న సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్, సింగరేణి కాలరీస్ స్ట్ఫా అండ్ వర్కర్స్ ఫెడరేషన్‌లు విలీనం కావాలని ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి సమక్షంలో నిర్ణయం జరిగింది. దీంతోపాటు జాతీయ స్థాయిలో ఎఐటియుసి నాయకులతో ఐఎన్‌టియుసి నాయకత్వం చర్చలు జరుపుతోంది. ఎఐటియుసి అనుబంధ సంఘాలు ఐఎన్‌టియుసి అనుబంధ సంఘాలతో కలిసి బరిలోకి దిగుతాయి. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టిబిజికెఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా రెండు యూనియన్లు కలిసి పోటీచేస్తే విజయం తథ్యమని భావిస్తున్నాయి. ఆయితే రెండు యూనియన్ల కార్యకర్తలు మాత్రం నేతల అభిప్రాయాలను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.