తెలంగాణ

పొరపాట్లు అధిగమించేందుకు టెక్నాలజీతో సమాధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న ఇంటర్మీడియట్ బోర్డు ఎట్టకేలకు వాస్తవాలను గ్రహించి, ఆధునిక టెక్నాలజీని వినియోగించడం ద్వారా పొరపాట్లు సరిదిద్దుకునేందుకు సిద్ధమవుతోంది. గత ఏడాది జరిగిన పొరపాట్లు మళ్లీ పునరావృత్తం కాకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు సీనియర్ అధికారులు అంతా చాలా గట్టిగా చెప్పడంతో ఈ ఏడాది బోర్డు అధికారులు మరింత దృష్టి సారించి టెక్నాలజీని ఊతంగా తీసుకుంటున్నారు. విద్యార్థుల సమాధాన పత్రాలను దిద్దిన తర్వాత మార్కులను వాల్యూయేటర్లు ఇంతకాలం ఎంఆర్ షీట్లపై నమోదు చేసేవారు. రెండు గడుల్లో అంకెల్లో వేయడంతో పాటు దాని పక్కనే బబ్లింగ్ చేసేవారు. ఆ ఒఎంఆర్ షీట్లను స్కానింగ్ చేయించినపుడు ఆప్టికల్ మార్కు రికగ్నైజేషన్ యంత్రాలు కేవలం బబ్లింగ్‌లో ఉన్న వాటినే స్వీకరించేవి. దాంతో అసలు మార్కులు 99 వచ్చినా, బబ్లింగ్‌లో 11 అని మార్కు చేస్తే వాటిని మాత్రమే స్వీకరించి విద్యార్థి ఫెయిల్ అయినట్టు సూచించేవి. దాంతో వేలాది మంది విద్యార్థులు గత ఏడాది అసౌకర్యానికి గురయ్యారు. కొంత మంది ఆత్మహత్యకు కూడా ఇంటర్ ఫలితాలు కారణమయ్యాయి. ఈసారి పక్కనే గడిలో వేసిన సంఖ్యను సైతం గుర్తించేలా ఆప్టికల్ మార్కురీడర్‌తో పాటు ఇంటిలిజెంట్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ (ఐసీఆర్) వినియోగిస్తున్నాయి. ఇవి అక్షరాలను , అంకెలను గుర్తించే సామర్ధ్యంతో ఉంటాయి. దాని వల్ల పక్కనే వేసిన 99 మార్కులను, ఒఎంఆర్‌లో బబ్లింగ్ చేసిన మార్కులను ఏకకాలంలో గుర్తించి తేడాలు ఉంటే ఆ సమాచారాన్ని అందించడంతో పాటు జవాబుపత్రాన్ని రిజెక్ట్ చేస్తాయి. అలా తేడా ఉన్న జవాబుపత్రాలను తాజాగా ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను ఉపయోగించి పొరపాటు ఎక్కడ జరిగిందో గుర్తిస్తారు. ఇలా ఒఎంఆర్, ఐసీఆర్, ఎఐ సాంకేతికతను వినియోగించి ఏ విద్యార్థికీ నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇంటర్ బోర్డు యోచిస్తోంది. ఇదంతా అనుకున్నది అనుకున్నట్టు జరిగితే విద్యార్థులకు మేలు జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అభిప్రాయపడుతోంది. టెక్నాలజీని సవ్యంగా వినియోగించుకోలేకపోతే ఫలితాలు దారుణంగా ఉంటాయని వారు చెబుతున్నారు. ఈసారి బోర్డు ఎవరికి న్యాయం చేస్తుందో వేచి చూడాలని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.