తెలంగాణ

ట్రోఫీని ఆవిష్కరించిన క్రీడల మంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ సీజన్-3 ఈనెల 22 నుంచి మార్చి 14 వరకు యూసుఫ్‌గూడలోని కోట్ల సాట్స్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తారు. రవీంద్రభారతిలోని మంత్రి కార్యాలయంలో ట్రోఫీని క్రీడల శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేటి యువతరం చదువుతో పాటు క్రీడల పట్ల శ్రద్ద వహించాలన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రెండు శాతం రిజర్వేషనర్ కల్పించి ప్రోత్సహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీకేఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు.

*చిత్రం...తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ ట్రోఫీని ఆవిష్కరిస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్