తెలంగాణ

ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 22: పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవపట్టిస్తుందని, ట్రయల్న్‌ల్రతోనే బంగారు సాధ్యం కాదనే విషయాన్ని గుర్తించుకోవాలని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఆరోపించారు. నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు చేస్తున్న హడావిడి అంతా కేవలం ప్రచారం కోసమేనని తెలంగాణలో ప్రతి ఎకరాకు నీరు అందించినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందనే విషయాన్ని మరిచిపోవద్దని ఆయన హితవు పలికారు. శుక్రవారం నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకం సాధన పాదయాత్ర ప్రారంభానికి విచ్చేసిన ఆయన మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టు సాధనలో ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని విమర్శించారు. రెండేళ్ల టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రాజెక్టుల పురోగతి అతిగతీ లేదని కొన్నింటిని చూపించుకుని వాటిని భూతద్దంలో ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. ట్రయల్న్‌ల్రతోనే అంతా సస్యశ్యామలం అయినట్లు గోబెల్స్ ప్రచారానికి శ్రీకారం చుట్టారని ఎద్దేవా చేశారు.
నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అన్ని అనుమతులు ఉన్నాయని ఆ ప్రాజెక్టును ఎందుకోసం నిర్మించడం లేదని ఈ విషయంలో ప్రజలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకం విషయంలో ద్వంద వైఖరిని వీడాలని శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి నారాయణపేట- కొడంగల్ నియోజకవర్గాలకు సాగునీరు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వం హైదరాబాద్‌లో ఉగ్రవాదుల శక్తులు పెరుగుతున్నా.. ముఖ్యమంత్రి కెసిఆర్ ఓటు బ్యాంకు రాజకీయాలతో వారిని అణచివేసే కార్యక్రమానికి దిగడం లేదని ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు.
ఓ వర్గానికి సంబంధించిన ఓట్లు పడవనే ఉద్దేశంతో ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ ఉగ్రవాదులకు హైదరాబాద్‌ను అడ్డాగా మార్చే పరిస్థితులను మానుకోవాలని హితవు పలికారు. విలేఖరుల సమావేశంలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

మహబూబ్
నగర్‌లో
విలేఖరుల
సమావేశంలో మాట్లాడుతున్న బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు