తెలంగాణ

ఉద్యోగుల కృషితోనే పథకాలు విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 23 : ప్రజాప్రతినిధులు బాధ్యతతో పనిచేసినప్పుడే సమాజంలో అసమానతలు తొలగి సమాజంలో మార్పులు వచ్చి పురోభివృద్ధి సాధ్యవౌతుందని రాష్ట్ర వ్యవసాయాశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారంనాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెంలో జరిగిన పల్లె, పట్టణ ప్రగతి ప్రజాప్రతినిధుల సమ్మేళనం నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల ప్రతిపాదికన సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో ప్రభుత్వం కొనసాగుతూ దేశంలోనే అభివృద్ధిలోనే ఆగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం అవసరమని గుర్తించే పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం పటిష్టంగా చేపట్టిందన్నారు. కొత్త మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టాల ద్వారా ప్రజాప్రతినిధులకు గ్రామాలు, పట్టణాల అభివృద్దికి సీఎం కేసీఆర్ అప్పగించిన గురుతర బాధ్యతలను నేరవేర్చడానికి కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. నిధులు విడుదల చేయడం గొప్పకాదని అవి సద్వినియోగం అవుతున్నాయనేదే ముఖ్యమని ఆ దిశగా ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తున్నదని అన్నారు. సమాజంలో మార్పుతేచ్చే ప్రతి పని వేనుక క్షేత్రస్థాయిలో ఉద్యోగుల కృషి దాగి ఉందని వారి పనితనం వల్లనే ప్రభుత్వ పథకాలు విజయవంతం అయ్యాయని తెలిపారు. ప్రజలకు ఏ పనులు అవసరమో క్షేత్రస్థాయిలో గుర్తించి నెరవేర్చినప్పుడే ప్రజాప్రతినిధులను ప్రజలు గుర్తించుకుంటారని తెలిపారు. తొలి విడత పల్లెప్రగతిలో సర్పంచులు, గ్రామ కార్యదర్శులు అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. గ్రామాల అభివృద్ధిని ఆదర్శంగా తీసుకొని తమ గ్రామాలను కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి పోటీపడి పనిచేయాలని అన్నారు. మహారాష్ట్ర రైతు రాలెగావ్ విజయగాథలు దేశానికే దిక్చూచి అయ్యాయని మంత్రి అన్నారు. సీఎం కేసీ ఆర్ 25 సంవత్సరాల క్రితమే సిద్దిపేటకు తాగునీరు తీసుకొని వచ్చారని ఆ ఫలితాలఫలమే నేటి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు అన్నారు. ఎంపీ రాములు, జడ్పీ చైర్‌పర్సన్ పద్మావతమ్మ, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ్ధర్, అదనపు కలెక్టర్ మనూచౌదరి, జడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...పంచాయతీరాజ్ సమ్మేళనంలో మాట్లాడుతున్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి